బాలయ్య డబ్బులకి ఆవిడే దొరికింది

బాలయ్య డబ్బులకి ఆవిడే దొరికింది

బాలకృష్ణ ఇటీవలి చిత్రాల పరాజయంతో పాటు బోయపాటి శ్రీను గత రెండు సినిమాలు ఫ్లాప్ అవడం పురస్కరించుకుని వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా మూడవ చిత్రానికి వీలయినంత కాస్ట్ కటింగ్ చేయాలని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి తెగేసి చెప్పడంతో అయిష్టంగానే బోయపాటి సర్దుబాట్లు మొదలు పెట్టాడు. ఈ చిత్రంలో కథానాయికలుగా ముందు బాలీవుడ్ హీరోయిన్లని తీసుకుందాం అనుకున్నారు. అయితే ఇప్పుడు హీరోయిన్స్ కోసం కేటాయించిన బడ్జెట్ లో బాలీవుడ్ హీరోయిన్స్ కాదు కదా దక్షిణాదిలో బిజీగా ఉన్న హీరోయిన్స్ ఎవరు దొరికే వీల్లేదు. అందుకే ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా అంజలిని ఖరారు చేసారు.

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో ఒక కీలక పాత్ర చేస్తున్న అంజలి గతంలోనే బాలయ్యతో ఒక సినిమా చేసింది. బాగా స్లిమ్ అయి యువ హీరోల పక్కన ఆఫర్స్ కోసం చూస్తున్న అంజలికి అలాంటివి ఏమి రావడం లేదు. అందుకే వచ్చిన అవకాశాలనే వదలకుండా అంది పుచ్చుకుంటోంది. ఈ చిత్రానికి కనీసం డెబ్భై కోట్ల బడ్జెట్ కావాలని అడిగిన బోయపాటి శ్రీను ఇప్పుడు యాభై కోట్లలో వర్కౌట్ అయ్యేలా జాగ్రత్త పడుతున్నాడు. ఇందుకు అనుగుణంగా అటు బాలయ్యతో పాటు ఇటు బోయపాటి కూడా పారితోషికం కుదించుకోక తప్పలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English