క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం అనేది నా ఫీలింగ్ - బెల్లంకొండ సాయి శ్రీనివాస్

క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం అనేది నా ఫీలింగ్ - బెల్లంకొండ సాయి శ్రీనివాస్

బెల్లంకొండ సురేష్ సినీ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తనను తాను నిరూపించుకునేందుకు తనదైన శైలిలో విభిన్నమైన సినిమాలు తీస్తున్నారు. 2019లో 'రాక్షసుడు' సినిమాతో సూప‌ర్ హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ జనవరి 3న పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ...

ఏడాదికి ఎన్ని సినిమాలు చెయ్యాలని ప్లాన్ చేశారు ?
నాకు ఛాలెంజెస్ అంటే ఇష్టం. ఏడాదికి రెండు సినిమాలు చేసినా మంచి సినిమాలు చెయ్యాలని, క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం అని సినిమాలు చేస్తున్నాను. కథ బలం ఉన్న సినిమాలనే ఒప్పుకుంతున్నాను. దిల్ రాజు బ్యానర్‌లో ఓ సినిమా త్వరలో చెయ్యబోతున్నాను.

ఎలాంటి సినిమాలు చెయ్యాలని అనుకుంటున్నారు ?
కంటెంట్ బేస్‌డ్ ఫిల్మ్‌లను చేయాలని అనుకుంతున్నాను. అందుకే సినిమాలు తక్కువగా చేస్తున్నాను. గతంలో నాలుగు సినిమాలు ఒక సంవత్సరంలో విడుదల అయ్యాయని, అయితే ఇప్పుడు మంచి సినిమాలను మాత్రమే తీయ్యాలని నిర్ణయించుకున్నాను.

కొత్త దర్శకులతో సినిమాలు చేస్తారా ?
తెలియకుండానే ఎక్కడో ఏదో మిస్ అవుతున్నామనే భయం ఉంది. అందుకే ఆచితూచి సినిమాలు చేస్తున్నాను. కొత్త డైరెక్టర్లతోనే ఇంతకాలం ఎక్కువ సినిమాలను చేశానని, కొత్త డైరెక్టర్లను ఎక్కువగా ప్రోత్సహిస్తాను. తన సినిమాల విషయంలో నాన్న విన్న తర్వాత కథను  ఫిల్టర్ చేసి పంపిస్తాడు. ది బెస్ట్ సబ్జెక్ట్స్ ను సెలెక్ట్ చేసుకుంటూ వెళుతున్నాను.

సంతోష్ శ్రీనివాస్ సినిమా విడుదల గురించి ?
ప్రస్తుతం నేను సంతోష్ శ్రీనివాస్ తో చేస్తున్న సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తి అయింది. మార్చిలో షూటింగ్ పూర్తి కానున్న ఈ సినిమాను మేలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాము. దేవి శ్రీ ప్రసాద్ తో నాకు ఇది మూడో సినిమా.

సాయి గణేష్ గురించి ?
సాయి గణేష్ సినిమా షూటింగ్ లొకేషన్ కు వెల్లడం జరిగింది. తను బాగా చేస్తున్నాడు. ఇటీవలే ఒక సాంగ్ చూశాను, డాన్స్ మూమెంట్స్ బాగా చేశాడు. పవన్ సాధినేని డైరెక్షన్, కార్తిక్ ఘట్టమనేని కెమెరా వర్క్ ఇలా అన్ని ఆ సినిమాకు బాగా కుదిరాయి.

నెక్స్ట్ సినిమా ఎప్పుడు ?
సంతోష్ శ్రీనివాస్ సినిమా టైటిల్ త్వరలో ప్రకటిస్తాము. ఈ సినిమా విడుదల తరువాత మరో సినిమా స్టార్ట్ చేస్తాను. ప్రస్తుతం కథలు వింటున్నాము.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English