పేక ఆడండని చెప్తోన్న కాజల్‌

పేక ఆడండని చెప్తోన్న కాజల్‌

ఆన్‌లైన్‌ రమ్మీ, కార్డ్‌ గేమ్స్‌ని ఇండియాలోని మరికొన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణలోను నిషేధించారు. ఆన్‌లైన్‌లో ఛాన్స్‌ గేమ్‌లు ఆడడం వల్ల చాలా మంది ఆస్తులు పోగొట్టుకుంటున్నారని తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది స్కిల్‌ గేమ్‌ అంటూ సదరు ఆన్‌లైన్‌ గేమింగ్‌ వెబ్‌సైట్లు కోర్టులో పోరాడుతున్నాయి. తెలంగాణ మాట ఎలా వున్నా ఏటా ఇండియాలో ఆన్‌లైన్‌ రమ్మీ రెవెన్యూ పన్నెండు వేల కోట్ల రూపాయలు వుంటుందని అంచనా.

మరింత మందిని ఇటువైపు ఆకర్షించడానికి వివిధ వెబ్‌సైట్లు ప్రముఖ హీరోయిన్లని బ్రాండ్‌ అంబాసిడర్లుగా పెట్టుకుంటున్నాయి. ఒక కార్డ్‌ గేమ్స్‌ వెబ్‌సైట్‌కి సన్నీలియోన్‌ ఎప్పట్నుంచో ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు కాజల్‌ కూడా ఓ పేకాట సైట్‌కి ప్రచారం చేసే బాధ్యతలు తీసుకుంది.

కేవలం ప్రచారమే కాకుండా తాను రెగ్యులర్‌గా ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడతానని చెబుతోంది. అఫ్‌కోర్స్‌ సినిమా వాళ్లు నిజంగానే కార్డ్‌ గేమ్స్‌ భేషుగ్గా ఆడతార్లెండి. పలువురు సినీ తారలు సెట్స్‌లో షాట్‌ గ్యాప్‌లోనే పేకాటలో మునిగి తేలిపోతుంటారు. నేషనల్‌ వైడ్‌గా పాపులర్‌ అయిన కాజల్‌ లాంటి వాళ్లు ఇలాంటివి ఆడమని ప్రోత్సహిస్తూ వుంటే ఇంకెంత మంది ఇటుగా ఆకర్షితులు అవుతారో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English