పూజా హెగ్డే.. వాట్ ఎ బౌన్స్ బ్యాక్

పూజా హెగ్డే.. వాట్ ఎ బౌన్స్ బ్యాక్

పూజా హెగ్డేకు కెరీర్ ఆరంభంలో ఏ ఇండస్ట్రీలోనూ కలిసి రాలేదు. వివిధ భాషల్లో ఆమె చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ కావడంతో ఆమెపై ఐరెన్ లెగ్ ముద్ర వేశారు. తమిళంలో ‘మాస్క్’ అనే సినిమాతో కథానాయికగా మారిందామె. జీవా హీరోగా నటించిన ఆ చిత్రం డిజాస్టర్ అయింది. తెలుగులో ‘ఒక లైలా కోసం’ సినిమాతో అరంగేట్రం చేయగా అది కూడా నిరాశ పరిచింది. ఇక హిందీలో పూజా నటించిన ‘మొహెంజదారో’ గురించి చెప్పాల్సిన పని లేదు.

బాలీవుడ్ హిస్టరీలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. దీంతో పూజాపై నెగెటివ్ ముద్ర పడిపోయింది. కానీ ఒక స్టార్ హీరోయిన్ కాగల ఫీచర్స్ అన్నీ ఉండటంతో పూజాను ఇండస్ట్రీ జనాలు పక్కన పెట్టలేదు. తెలుగులో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఆమెకు ప్రేక్షకులకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకున్నా పూజా మాత్రం తన గ్లామర్‌తో యువ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత ఆమె వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది.

ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ల పక్కన నటించి తారా పథానికి దూసుకెళ్లిన పూజా.. ఇప్పుడు అల్లు అర్జున్, ప్రభాస్‌ల సరసన సినిమాలు చేస్తోంది. వాల్మీకి సినిమాలో ఒక 20 నిమిషాలు కనిపించే రోల్‌కు కోటి రూపాయల పారితోషకం అందుకునే స్థాయికి ఎదిగింది పూజా. సినిమాలో ఆమె పాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూస్తే కోటి రూపాయలు తక్కువే అనిపిస్తుంది. టాలీవుడ్లో తిరుగులేని స్థాయికి చేరుకున్న పూజా తన సొంత భాషలోనూ సత్తా చూపించేందుకు రెడీ అయింది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘హౌస్ ఫుల్-4’లో పూజా కీలక పాత్ర చేస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లో పూజా సెక్సీ లుక్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఈ చిత్రంలో కృతి కర్బందా, కృతి సనన్ కూడా నటిస్తున్నారు కానీ.. పూజా గ్లామర్ ముందు వాళ్లు నిలిచేలా లేదు. హిట్టు కళ కనిపిస్తున్న ఈ చిత్రంతో పూజా హిందీలోనూ పెద్ద రేంజికి వెళ్లడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి పూజా కెరీర్ ఎంత పేలవంగా ఆరంభమైనప్పటికీ.. ఇప్పుడున్న స్థాయికి చేరుకోవడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English