చిరు కోసం మ‌ళ్లీ అలాగే ఎగ‌బ‌డ‌తారా?

చిరు కోసం మ‌ళ్లీ అలాగే ఎగ‌బ‌డ‌తారా?

మూడేళ్ల కింద‌ట మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్న‌పుడు ప్రేక్ష‌కుల్లో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఆయ‌న మ‌ళ్లీ సినిమాల్లోకి రావ‌డాన్ని స్వాగ‌తించారు కానీ.. రీఎంట్రీకి రీమేక్ సినిమాను ఎంచుకోవ‌డం చాలామందికి న‌చ్చ‌లేదు. ఈ సినిమా విష‌యంలో వ్య‌తిరేక భావ‌న‌తో ఉన్నారు.

అంత‌కుముందు చిరు క్యామియో చేసిన బ్రూస్ లీ డిజాస్ట‌ర్ అయిన నేప‌థ్యంలో ఖైదీ నంబ‌ర్ 150 ఎంత‌మాత్రం ఆడుతుందో.. చిరును మ‌ళ్లీ తెర‌పై చూసేందుకు ప్రేక్ష‌కులు ఏమేర ఆస‌క్తి చూపిస్తారో అన్న సందేహాలు క‌లిగాయి. విడుద‌ల‌కు ముందు చిత్ర బృందం కూడా ఉత్కంఠ‌కు గురైంది. దీంతో పోలిస్తే గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణికే హైప్ ఎక్కువ‌న్న‌ట్లు అనిపించింది.

కానీ విడుద‌ల ముంగిట క‌థ మారిపోయింది. ఖైదీ నంబ‌ర్ 150కి అనూహ్య‌మైన క్రేజ్ వ‌చ్చింది. చిరును మ‌ళ్లీ సిల్వ‌ర్ స్క్రీన్ మీద చూసేందుకు తెలుగు ప్రేక్ష‌కులు ఎగ‌బ‌డిపోయారు. ఓవ‌ర్సీస్‌లో అస‌లు చిరు సినిమాను ఏమాత్రం ప‌ట్టించుకుంటారో అనుకుంటే అక్క‌డి జ‌నాలు కూడా ఊగిపోయారు. ప్రిమియ‌ర్ల‌తోనే మిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా వ‌సూలు చేసిందీ చిత్రం. ఫుల్ ర‌న్లో 2.5 మిలియ‌న్ డాల‌ర్ల దాకా వ‌చ్చాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎలా వ‌సూళ్ల మోత మోగిందో తెలిసిందే. ప‌దేళ్ల పాటు ఇండ‌స్ట్రీలో లేని చిరు.. త‌న త‌ర్వాత మార్కెట్‌ను గ్రాబ్ చేసిన స్టార్ల‌కు దీటుగా, వాళ్ల‌ను మించి ఓపెనింగ్స్ సాధించాడు. ఐతే అది గ‌తం. చిరును మ‌ళ్లీ తెర‌పై చూడాల‌న్న ఎగ్జైట్మెంట్లో జ‌నాలు అలా ఎగ‌బ‌డ్డారు. మ‌రి సైరాకు కూడా అదే స్థాయిలో ఎగ్జైట్మెంట్ ప్రేక్ష‌కుల్లో ఉంటుందా? ఇప్పుడు సినిమాకు బ‌జ్ కాస్త అటు ఇటుగా ఉంది. రిలీజ్ స‌మ‌యానికి ప‌రిస్థితి మారి ఖైదీ త‌ర‌హాలోనే హైప్ పెరుగుతుందా? మ‌రోసారి చిరు త‌న బాక్సాఫీస్ స్టామినా చూపిస్తాడా?


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English