ఆగని కాజల్ దండయాత్ర

ఆగని కాజల్ దండయాత్ర

ఉత్తరాది భామలు దక్షిణాదికి వచ్చి ఇక్కడ ఎన్ని హిట్లు అందుకున్నా.. ఎంత పెద్ద హీరోయిన్‌గా అయినా.. వాళ్ల మనసు బాలీవుడ్ మీద ఉంటుంది. తమ సొంత భాషలో సినిమాలు చేసి దేశవ్యాప్త గుర్తింపు పొందాలన్న ఆశ ఉంటుంది. ఈ దిశగా ఎంతోమంది ఉత్తరాది హీరోయిన్లు ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్లలో చాలా తక్కువమందే విజయవంతం అయ్యారు.

దక్షిణాదిన తెలుగు, తమిళ భాషల్లో పెద్ద కథానాయికగా ఎదిగిన కాజల్ అగర్వాల్.. అప్పుడప్పుడూ బాలీవుడ్ బాట పడుతూనే ఉంది. కానీ ఆమెకు హిట్ వస్తే పేరు రావట్లేదు. పేరొస్తే హిట్ పడట్లేదు. చాలా ఏళ్ల కిందట ఆమె ‘స్పెషల్ చబ్బీస్’, ‘సింగం’ సినిమాల్లో కథానాయికగా నటించింది. ఆ రెండూ హిట్టయ్యాయి. కానీ వాటిలో కాజల్‌ది కరివేపాకు పాత్ర. ఆమెకు ఎలాంటి పేరూ రాలేదు.

కొంచెం గ్యాప్ తీసుకుని ‘దో లఫ్జోంకీ కహానీ’ అనే సినిమా చేసింది. రణదీప్ హుడా హీరో. ఇందులో హీరోహీరోయిన్లద్దరూ అంధులు. రణదీప్, కాజల్ ఇద్దరూ చక్కటి పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఐతే ఈసారి కాజల్‌కు పేరు మాత్రమే మిగిలింది. సక్సెస్ దక్కలేదు. దీంతో మళ్లీ నిరాశ తప్పలేదు. ఈ దెబ్బతో కాజల్ మళ్లీ హిందీ సినిమాల వైపు చూడలేదు. దక్షిణాదినే బేస్ దెబ్బ తినేలా ఉంటే ఇక్కడి సినిమాల మీదే ఫోకస్ పెట్టింది. ఇక్కడ ఓ మోస్తరుగా కెరీర్ సాగిపోతుండగా.. ఇప్పుడు మళ్లీ హిందీ వైపు దృష్టిసారించింది.

ఆమె జాన్ అబ్రహాం కొత్త సినిమా ‘ముంబయి సెగా’లో కథానాయికగా నటించబోతోంది. ఇందులో కాజల్ 17 ఏళ్ల అమ్మాయిగా విభిన్నమైన పాత్ర పోషించనుందట. ఇందులో ఇమ్రాన్ హష్మి మరో హీరోగా నటిస్తున్నాడు. టెర్రరిజం నేపథ్యంలో సాగే ఈ సినిమాను ‘కాంటే’ ఫేమ్ సంజయ్ గుప్తా రూపొందిస్తున్నాడు. మరి ఈ చిత్రంలో అయినా కాజల్ దండయాత్ర ఫలించి ఆమెకు హిందీలో హిట్, పేరు రెండూ వస్తాయేమో చూడాాలి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English