దెబ్బకి హీరోగారికి రియాలిటీ తెలిసింది

దెబ్బకి హీరోగారికి రియాలిటీ తెలిసింది

హిప్పీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కార్తికేయ మాట్లాడినది వింటే 'ఇతను ఇంత పెద్ద హీరోనా?' అనుకుంటారు తెలుగు సినిమా గురించి తెలియని వారు. ఆర్‌ఎక్స్‌ 100కి పదింతల హిట్టిస్తున్నా అంటూ 'ఫాన్స్‌'ని ఉత్తేజ పరిచిన కార్తికేయ ఆ ఈవెంట్‌లో దాదాపు అరగంట పాటు మాట్లాడాడు. స్టార్‌ హీరోలు కూడా ఫాన్స్‌ని అంత సేపు అడ్రస్‌ చేయరు. అలాంటిది తానేదో అద్భుతమైన సినిమా చేసేసినట్టు చాలా ఎక్కువ చేసాడు.

బహుశా నిజంగానే హిప్పీ అంత గొప్ప సినిమా అని అనుకున్నాడేమో. బూతు మాటలు పెట్టేసి, సెక్స్‌ కబుర్లు చెప్పేస్తే కుర్రాళ్లు ఎగబడి సినిమాకొస్తారనే భ్రమ నిజంగానే వుందేమో. కానీ హిప్పీ చిత్రానికి వస్తోన్న అత్తెసరు వసూళ్లు చూస్తే ఈ పాటికి తనకి ఎంత క్రేజ్‌ వుందనేది కార్తికేయకి తెలిసి వుంటుంది.

ఫ్లాప్‌ టాక్‌ వచ్చిన తర్వాత వసూళ్లు పడిపోవడం కాదు. తెలంగాణలో మూడు రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా పది లక్షల షేర్‌ రాలేదు. మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కోటి రూపాయల షేర్‌ కూడా రాలేదు. ఇతనో పెద్ద స్టార్‌ అయిపోయాడని తప్పు లెక్క వేసి ఈ చిత్రాన్ని కలైపులి థాను భారీ స్థాయిలో నిర్మించగా, చిల్లర మాత్రం తిరిగి వస్తోందిపుడు. ఈ దెబ్బతో కార్తికేయకే కాకుండా అతనికి ఏ పాటి ఫాలోయింగ్‌ వుందనేది ఇండస్ట్రీకి కూడా రియాలిటీ చెక్‌ చేసుకునే వీలు చిక్కిందిప్పుడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English