అతి చేస్తే తెలంగాణ ఓటర్లకు మండుద్ది

అతి చేస్తే తెలంగాణ ఓటర్లకు మండుద్ది

దేశం మొత్తంలో ఆసక్తికర ఫలితాలు వచ్చిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఆరునెలల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన తెలంగాణ రాష్ట్ర సమితికి పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి గట్టి ఎదురు దెబ్బ తింది. సారు.. కారు.. పదహారు అంటూ ఊరికే హోరెత్తించేశారు  కానీ.. కనీసం పది సీట్లు కూడా సాధించలేకపోయింది కేసీఆర్ పార్టీ. 9 ఎంపీ సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇది టీఆర్ఎస్ స్వయంకృతం అనడంలో సందేహం లేదు. తెలంగాణ ఓటర్ల దగ్గర ఎవరు అతి చేసినా సహించరని ఈ ఎన్నికలతో మరోసారి రుజువైంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అతి చేసింది ప్రతిపక్ష పార్టీలే. ఒంటరిగా పోటీ  చేస్తే కాంగ్రెస్ పార్టీ అంత కంటే మెరుగైన ఫలితాలు రాబట్టేదేమో. చంద్రబాబుతో కలిసి ఆ పార్ట ీచేసిన హడావుడి జనాలకు చికాకు తెప్పించిందని ఫలితాలతో స్పష్టమైంది. ఇటు కాంగ్రెస్, అటు టీడీపీ రెండింటి మీదా తమ కోపాన్ని చూపించారు ఓటర్లు. కూకట్ పల్లిలో నందమూరి సుహాసిని ఓడిపోవడం లాంటివి జనాలకు ఎంతగా మండిందో చెప్పడానికి ఒక ఉదాహరణ.

ఐతే అప్పుడు ప్రతిపక్షాల మీద చూపించిన అసహనాన్నే ఇప్పుడు అధికార పార్టీ మీద చూపించారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ అండ్ కో చూపించిన అహంకారం వారికి మంట పుట్టించినట్లుంది. అంత మెజారిటీ ఇచ్చాక కూడా వలసల్ని ప్రోత్సహించి ప్రతిపక్షమే లేకుండా చూడాలని ప్రయత్నించడం జనాలకు అసహనం తెప్పించిందన్నది స్పష్టం. పార్లమెంట్ ఎన్నికల్ని భిన్నమైన దృక్కోణంలో చూసిన సంగతి స్పష్టం.

టీఆర్ఎస్ పార్టీకి ఎంపీల్ని ఇస్తే ఏం చేస్తారు అనే ప్రశ్న కూడా జనాలు వేసుకున్నట్లే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అందించిన విజయంతో టీఆర్ఎస్ నాయకులకు అహంకారం పెరిగిందని, దాన్ని తుంచాలని గట్టిగా ఫిక్సయ్యే ఓట్లు వేసినట్లున్నారు. తమకు అసహనం తెప్పిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో తెలంగాణ ఓటర్లు మరోసారి రుజువు చేశారన్నది స్పష్టం.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English