తమిళ రవితేజ నేల మీదికి వచ్చేశాడు

తమిళ రవితేజ నేల మీదికి వచ్చేశాడు

తెలుగులో రవితేజ లాగా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న యువ కథానాయకుడు శివ కార్తికేయన్. రేడియో జాకీగా ప్రయాణం మొదలుపెట్టి.. ముందు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి.. ఆ తర్వాత ‘ఎదిర్ నీచిల్’ అనే సినిమాతో హీరోగా మారి తొలి ప్రయత్నంలోనే పెద్ద హిట్ కొట్టాడు ఈ కుర్రాడు. ఆ తర్వాత ‘వరుత్త పడాద వాలిబర్ సంఘం’ (తెలుగులతో కరెంటు తీగ), ‘రజనీ మురుగన్’, ‘వేలైక్కారన్’ లాంటి సూపర్ హిట్లు అతడికి స్టార్ ఇమేజ్ తెచ్చపెట్టాయి.

శివ ఫాలోయింగ్ ఏ స్థాయికి చేరిందంటే యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాలతో కూడా హిట్లు కొట్టేశాడు. ‘మాన్ కరాటె’, ‘రెమో’ ఆ కోవలోని సినిమాలే. ఐతే ఎలాంటి హీరోకైనా ఏదో ఒక దశలో బ్రేక్ పడటం మామూలే. చాన్నాళ్లు ఒద్దికగా కనిపించాడు కానీ.. ఒక దశలో శివకు సక్సెస్ తలకెక్కేసిందన్న విమర్శలు వచ్చాయి.

ఒక ఇంటర్వ్యూలో భాగంగా స్టార్ హీరో విజయ్ గురించి నెగెటివ్ కామెంట్లు చేయడంతో దళపతి అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో వాళ్లు శివకు వ్యతిరేకంగా సోషల్ మీడియా క్యాంపైన్ నడిపారు. శివకు ఎప్పుడు ఫ్లాప్ పడుతుందా అని వెయిట్ చేశారు. గత ఏడాది ‘‘సీమ రాజా’ రూపంలో ఛాన్స్ వచ్చింది. ఈ రూరల్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా దెబ్బ తింది. శివ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ ఫ్లాప్. ఇక తాజాగా శివ ‘మిస్టర్ లోకల్’ అనే సినిమాతో పలకరించాడు.

శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తొలి షోతోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సాయంత్రానికి థియేటర్లు వెలవెలబోయాయి. శివ కెరీర్లో ఇదే అత్యంత చెత్త సినిమా అంటున్నారు. ఎం.రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించింది. మొత్తానికి కొన్నేళ్ల పాటు వరుస విజయాలతో పట్టపగ్గాల్లేకుండా సాగిపోయిన శివ.. వరుసగా రెండు ఫ్లాపులు పడేసరికి నేలమీదికి వచ్చేశాడు. తర్వాతి సినిమా ఫలితం మారకుంటే మాత్రం అతడి కెరీర్ ప్రమాదంలో పడటం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English