ఆర్‌ఎక్స్‌ 100 ఎక్కుతోన్న అక్కినేని జంట

ఆర్‌ఎక్స్‌ 100 ఎక్కుతోన్న అక్కినేని జంట

నాగ చైతన్య, సమంత ఎంతటి హిట్‌ పెయిర్‌ అనేది తెలిసిందే. రీసెంట్‌గా మజిలీతో ఈ జంట మరో హిట్‌ కొట్టింది. పెళ్లయిన తర్వాత తెరపై భారాభర్తలుగా నటించడంతో మజిలీకి స్పెషల్‌ క్రేజ్‌ ఏర్పడింది. దీంతో వీరిద్దరూ జంటగా మరిన్ని సినిమాలు తీయాలని నిర్మాతలు ఎగబడుతున్నారు. ఆర్‌ఎక్స్‌ 100 తర్వాత ఇంతవరకు రెండవ చిత్రం మొదలు పెట్టని అజయ్‌ భూపతి దర్శకత్వంలో వీరిద్దరూ జంటగా నటిస్తారని ఇన్‌ఫర్మేషన్‌.

రామ్‌తో, బెల్లంకొండ శ్రీనివాస్‌తో చేస్తున్నాడని ప్రకటనలు వచ్చినా కానీ అవి నిజం కాలేదు. వాళ్లిద్దరూ వేరే సినిమాలతో బిజీ అయిపోయారు. బెల్లంకొండ శ్రీనివాస్‌తో అనుకున్నపుడే సమంతని కథానాయికగా ఎంచుకున్నారు. ఇప్పుడు అతని స్థానంలో నాగచైతన్యని అప్రోచ్‌ అయ్యారు. మరోసారి సమంతతో కలిసి నటించే అవకాశాన్ని చైతన్య కూడా హ్యాపీగా అంగీకరించేసాడు.

వెంకీ మామ చిత్రం తర్వాత దీనిని మొదలు పెట్టాలని డిసైడ్‌ అయ్యాడు. మరోవైపు సమంత కూడా ఓ బేబీ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో వుంది. మజిలీలో మెచ్యూర్డ్‌ పెయిర్‌గా కనిపించిన వీరిని ఆర్‌ఎక్స్‌ 100 దర్శకుడు ఎలా చూపిస్తాడనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English