ఆవిడకి ఇదే లాస్ట్‌ హోప్‌

ఆవిడకి ఇదే లాస్ట్‌ హోప్‌

సాధారణంగా సినిమా ప్రమోషన్స్‌కి చాలా తక్కువ టైమ్‌ కేటాయిస్తారు హీరోయిన్లు. విడుదలకి ముందు నాలుగైదు రోజులు మాత్రమే మీడియాలో కనిపిస్తూ వుంటారు. కానీ లావణ్య త్రిపాఠి మాత్రం 'అర్జున్‌ సురవరం'కి ప్రమోషన్లు అప్పుడే మొదలు పెట్టేసింది. హీరో నిఖిల్‌ కంటే కూడా ఆమే ఎక్కువగా ఈ చిత్రాన్ని ప్రమోట్‌ చేస్తోంది. ఎందుకంటే లావణ్యకి ఇదే లాస్ట్‌ హోప్‌. ప్రస్తుతం తన చేతిలో మరో ప్రాజెక్ట్‌ ఏదీ లేదు. వరుస పెట్టి వచ్చిన ఫ్లాపులతో లావణ్యకి అవకాశాలు హరించి పోయాయి. భలే భలే మగాడివోయ్‌, సోగ్గాడే చిన్నినాయనా చిత్రాలతో సాధించిన విజయాలతో లావణ్య చాలా బిజీ అయిపోయింది.

అయితే కెరియర్‌ బ్యాలెన్స్‌ చేసుకోవడం రాక, మంచి కథలు ఎంచుకోలేక ఫ్లాపుల వలయంలో చిక్కుకుంది. మిస్టర్‌, రాధ, యుద్ధం శరణం, ఇంటిలిజెంట్‌, అంతరిక్షం లాంటి డిజాస్టర్లు లావణ్య వైపు నిర్మాతలని చూడనివ్వకుండా చేసాయి. దీంతో అర్జున్‌ సురవరం సక్సెస్‌ మీదే ఆమె భవిష్యత్తు ఆధారపడి వుంది. ఈ చిత్రం కానీ ఫెయిలయితే ఆమెకి కొత్త అవకాశాలు రావడం చాలా కష్టమైపోతుంది. అందుకే ఈ చిత్రాన్ని ఎలాగైనా హిట్‌ చేయాలని లావణ్య అందరి కంటే ముందుగా ప్రచారం మొదలు పెట్టేసింది. మార్చి 29న విడుదలయ్యే అర్జున్‌ సురవరం ఆమె హోప్స్‌కి తగ్గట్టు పర్‌ఫార్మ్‌ చేయగలదా లేదా అనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English