లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌: బాలకృష్ణ ఫాన్స్‌కి గుడ్‌ న్యూస్‌

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌: బాలకృష్ణ ఫాన్స్‌కి గుడ్‌ న్యూస్‌

బాలకృష్ణ కనుక తనని ఎన్టీఆర్‌ బయోపిక్‌ తీయడానికి సంప్రదించకపోతే 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' తీయాలనే ఆలోచనే తనకి వచ్చేది కాదని రాంగోపాల్‌వర్మ పేర్కొన్నాడు. ఎన్టీఆర్‌ బయోపిక్‌లో లక్ష్మీపార్వతి ఎపిసోడ్‌ వుండాలని తాను చెప్పానని, దానికి బాలకృష్ణ ఇష్టపడలేదని, ఓ విధంగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ రూపొందడానికి బాలయ్య కారణం కనుక ఈ చిత్రాన్ని ఆయనకి అంకితం ఇస్తున్నానని చెప్పాడు.

ఇప్పటికే ఎన్టీఆర్‌ బయోపిక్‌ దారుణమైన డిజాస్టర్‌ అవడంతో బాలయ్య అభిమానులు కుమిలిపోతున్నారు.
ఇప్పుడు 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'లో వర్మ ఏ విధంగా బాలయ్యని చూపిస్తాడో అనే ఆందోళనలోను వున్నారు. అయితే ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ ప్రకారం ఈ చిత్రంలో బాలకృష్ణని విలన్‌లా చూపించలేదని, తండ్రిని అర్థం చేసుకున్న కొడుకుగా, ఆయన ఆవేదన తెలిసినవాడిగా చూపించాడని తెలిసింది. తండ్రి పట్ల సానుభూతిని, ఆయనకి జరుగుతున్న అన్యాయం పట్ల ఆవేదనని బాలయ్య ఎలా అనుభవించాడనేది వర్మ తనదైన శైలిలో చూపించాడట.

అయితే సోదరీ సోదరులు అంతా ఒకవైపున వుండడంతో ఇక తప్పని పరిస్థితుల్లో బాలయ్య తండ్రి వైపు నిలబడలేకపోయినట్టుగా ఇందులో సన్నివేశాలు వుంటాయట. ఈ చిత్రం స్వర్గీయ ఎన్టీఆర్‌ పట్ల మాత్రమే కాకుండా బాలయ్య మీద కూడా సానుభూతి వచ్చేట్టు వుంటుందని విశ్వసనీయంగా తెలిసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English