అనవసరంగా బాలకృష్ణ ఇరుక్కున్నాడా?

అనవసరంగా బాలకృష్ణ ఇరుక్కున్నాడా?

ఎన్టీఆర్‌ బయోపిక్‌ ప్రపోజల్‌ వచ్చినపుడు బాలకృష్ణ నిర్మాత కాదు. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి ఈ చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచనతో బాలయ్యని అప్రోచ్‌ కాగా, నిర్మాతగా తానూ జాయిన్‌ అవుతానని బాలకృష్ణ చెప్పారు. అలా ముగ్గురు నిర్మాతలతో మొదలైన బయోపిక్‌ అటుపై పూర్తిగా బాలకృష్ణ చేతుల్లోకి వెళ్లింది. మొదట నిర్మాతలుగా వున్న వాళ్ల పేర్లు సహ నిర్మాతల లిస్టులోకి చేరాయి.

నిర్మాతలుగా బాలయ్య, ఆయన భార్య వసుంధర పేర్లు పడ్డాయి. మొదట ఒకటే భాగంగా అనుకున్న చిత్రాన్ని రెండు భాగాలు చేసారు. కాగా ఈ రెండు భాగాల్లో మొదటి భాగానికి మాత్రమే సాయి, విష్ణు భాగస్వాములు. డెబ్బయ్‌ కోట్లకి పైగా బిజినెస్‌ జరిగిన మొదటి భాగానికి సాయి, విష్ణుల వాటా ఇచ్చేసారు. తీరా ఇపుడు రెండవ భాగాన్ని ఉచితంగా ఇచ్చేస్తున్నారు. అంటే బాలకృష్ణకి ఈ చిత్రంతో పైసా ఆదాయం కూడా వుండదు. బాలకృష్ణే కనుక నిర్మాత కాకపోతే ఆయనకి పారితోషికం వచ్చి వుండేది. ఈ తలనొప్పులన్నీ తప్పేవి. సినిమా ఫలితం ఏదయినా కానీ సదరు నిర్మాతలు పడేవారు. కానీ ఇప్పుడు ప్రతిష్టకి పోయి బాలకృష్ణ ఈ చిత్రాన్ని ఉచితంగా ఇచ్చేసారు. మొత్తానికి ఎన్టీఆర్‌ కథ కంటే ఇదే ఎక్కువ ఆసక్తిగా అనిపిస్తోందంటే అతిశయోక్తి కాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English