వెంకటేష్‌తో త్రివిక్రమ్‌... ఇదే రైట్‌ టైమ్‌

వెంకటేష్‌తో త్రివిక్రమ్‌... ఇదే రైట్‌ టైమ్‌

వెటరన్‌ స్టార్‌ వెంకటేష్‌కి మునుపటిలా ఇప్పుడు ఆదరణ వుండి వుండకపోవచ్చు కానీ ఆయన ఒక తరహా పాత్రలు చేస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. ముఖ్యంగా వెంకీ కామెడీ ఎప్పుడు చేసినా క్లిక్‌ అయింది. నువ్వు నాకు నచ్చావ్‌, మల్లీశ్వరి తర్వాత వెంకీతో అలా పూర్తి స్థాయిలో కామెడీ ఎవరూ చేయించలేదు. చాలా గ్యాప్‌ తర్వాత 'ఎఫ్‌2'లో వెంకీ రెచ్చిపోయారు. ఆయన చేసిన కామెడీకి ఇప్పుడు జనం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు. వెంకటేష్‌తో సినిమా చేస్తానని మాట ఇచ్చి, వెంకీ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని వాయిదా వేస్తోన్న త్రివిక్రమ్‌ ఇప్పుడైనా వెంకీకి ఆడియన్స్‌ని పుల్‌ చేసే పవర్‌ ఏంటో రియలైజ్‌ అవ్వాలి.

ఎఫ్‌2 చిత్రంలో ఇద్దరు హీరోలున్నా కానీ పూర్తిగా తానయి వన్‌ మ్యాన్‌ షో చేసిన వెంకటేష్‌ ఈ చిత్రం సక్సెస్‌కి మూల విరాట్‌ అని చెప్పాలి. వెంకటేష్‌తో పక్కా కామెడీ తీస్తే, అది కూడా త్రివిక్రమ్‌ లాంటి స్టార్‌ డైరెక్టర్‌ చేస్తే తప్పకుండా బిజినెస్‌ బ్రహ్మాండంగా జరుగుతుంది. వెంకీ బాడీలాంగ్వేజ్‌కి సూటయ్యేలా కామెడీ రాసుకుంటే మిగతాది ఆయనే చూసుకుంటారని మరోసారి ఎఫ్‌2తో రుజువయింది. ఏదో కారణం చెప్పి వెంకీతో సోలో సినిమా డిలే చేస్తోన్న త్రివిక్రమ్‌ ఇకనైనా ఆ ప్రాజెక్టుని ముందుకి తీసుకురాగలిగితే బాగుంటుంది. ప్రస్తుతం సోలో వేషాలు తగ్గించిన వెంకీ తదుపరి చిత్రంలో మేనల్లుడు నాగచైతన్యతో కలిసి 'వెంకీ మామ'గా దర్శనమివ్వనున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English