ఆ సినిమా.. 23 భాషల్లో

ఆ సినిమా.. 23 భాషల్లో

ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో పొలిటికల్ లీడర్ల బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి. తెలుగులో ‘యన్.టి.ఆర్’ సినిమా ఇంకో రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ తర్వాత వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’ రిలీజవుతుంది. మరోవైపు తమిళంలో జయలలిత మీద ఒకటికి మూడు బయోపిక్స్ రాబోతున్నాయి. ఆమె మీద ఒక వెబ్ సిరీస్ కూడా తెరకెక్కుతోంది. ఇక బాలీవుడ్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీద తీసిన ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ విడుదలకు సిద్ధమవుతోంది. బాల్ థాకరే జీవిత కథతో తెరకెక్కిన ‘థాకరే’ కూడా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ కోవలోనే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ జీవితాన్ని కూడా వెండి తెరకు ఎక్కించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

‘పీఎం నరేంద్ర మోడీ’ పేరుతో తెరకెక్కబోయే ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ మోడీ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ రోజే ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మోడీగా కనిపిస్తున్నది వివేక్ ఒబెరాయ్ అంటే గుర్తు పట్టడం కష్టమే. ఆ రకంగా అతడికి మేకోవర్ చేశారు. ఒకేసారి 23 భాషల్లో ‘పీఎం నరేంద్ర మోడీ’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం విశేషం. అందులో హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, పంజాబీ, భోజ్ పురి, మరాఠీ, బెంగాలీ.. ఇలా రకరకాల భాషలున్నాయి. ఇన్ని భాషల్లో ఫస్ట్ లుక్ లాంచ్ చేశారంటే సినిమా కూడా 23 భాషల్లోనూ రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ‘మేరీ కోమ్’.. ‘సరబ్జిత్’ లాంటి సినిమాలు తీసిన ఒమంగ్ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. మూణ్నాలుగు నెలల్లోనే సినిమాను పూర్తి చేసి సార్వత్రిక ఎన్నికల ముంగిట రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని వివేక్ ఒబెరాయ్ తండ్రి సురేష్ ఒబెరాయ్‌తో కలిసి సందీప్ సింగ్ నిర్మిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English