‘భారతీయుడు-2’ తర్వాత ఆ సినిమానే

‘భారతీయుడు-2’ తర్వాత ఆ సినిమానే

‘2.0’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగానే తాను సమీప భవిష్యత్తులో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా తీస్తానని ప్రకటించాడు శంకర్. ఈ లోపు ‘భారతీయుడు’ సీక్వెల్‌ను అతను పట్టాలెక్కించాడు. ఈ చిత్రం ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ దశలో ఉంది. అతి త్వరలోనే షూటింగ్ ఆరంభం కానుంది. ఈలోపే శంకర్ తన తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటుండటం విశేషం. ముందు అన్నట్లే అది సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ప్రధానంగా హిందీలో తీయబోతున్నాడు శంకర్. అందుకోసం బాలీవుడ్ హీరోను ఎంచుకున్నాడని సమాచారం. ఆ హీరో మరెవరో కాదు.. మాచో స్టార్ హృతిక్ రోషన్.

‘రోబో’ సినిమాను కూడా మొదట హిందీలోనే తీయాలనుకున్నాడు శంకర్. షారుఖ్ ఖాన్ ను హీరోగా అనుకోగా.. అతను ఈ సినిమా చేయడానికి ముందుకు రాలేదు. తర్వాత కమల్ హాసన్ ను సంప్రదించి.. చివరగా రజనీకాంత్ తో తీశాడు. గతంలో ‘ఒకే ఒక్కడు’ను హిందీలో ‘నాయక్’గా రీమేక్ చేసిన శంకర్ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ఐతే ఈ మధ్య ‘రోబో’.. ‘2.0’ సినిమాలతో బాలీవుడ్లో అతడికి ఫాలోయింగ్ పెరిగింది. అక్కడి హీరోలు శంకర్ ను బాగానే నమ్ముతున్నారు. గత కొన్నేళ్లుగా సరైన విజయం లేని హృతిక్.. శంకర్ అండతో మాంచి కమర్షియల్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఈ చిత్రానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం 2020లో పట్టాలెక్కే అవకాశముంది. ‘భారతీయుడు-2’ చిత్రాన్ని రూ.200 కోట్ల బడ్జెట్లో తెరకెక్కించనున్నాడు శంకర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English