ఎన్టీఆర్‌కి ఎదురు వెళ్లినా ఇదే గతి!

ఎన్టీఆర్‌కి ఎదురు వెళ్లినా ఇదే గతి!

రాంగోపాల్‌వర్మని సినీ ప్రియులు నమ్మడం మానేసి చాలా కాలమైంది. ఇక అతని అభిమానులయితే వర్మ తీసే సినిమాలు చూడడం కంటే అతను వేసే ట్వీట్లు చదువుకోవడం బెస్ట్‌ అనుకుంటున్నారు. భైరవ గీత చిత్రంపై ప్రేక్షకుల దృష్టి పడాలని రాంగోపాల్‌వర్మ చేయని ప్రయత్నమంటూ లేదు. ముందుగా కన్నడలో విడుదల చేసి పాజిటివ్‌ రివ్యూలు రాయించుకున్నారు. విడుదలకి రెండు రోజుల ముందు తెలుగు వెర్షన్‌ని మీడియాకి ప్రదర్శించారు.

ఎన్ని జిత్తులు వేసినా కానీ ఆఫీసర్‌ తర్వాత వర్మ సినిమా కోసం ప్రేక్షకులు కదిలి వస్తారని ఆశ పడడం వృధా ప్రయాస అని తేలిపోయింది. భైరవ గీతకి మినిమమ్‌ వసూళ్లు కూడా రావడం లేదు. వర్మ అప్పుడే తన తదుపరి చిత్రం హడావిడి మొదలు పెట్టేసాడు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ అంటూ ఎన్టీఆర్‌ జీవితంలోని లక్ష్మీపార్వతి ఎపిసోడ్‌ని తెరకెక్కిస్తానంటున్నాడు వర్మ. బాలకృష్ణ తీస్తోన్న బయోపిక్‌కి పోటీగా విడుదల చేస్తానని కూడా అంటున్నాడు.

అయితే ప్రస్తుతం వర్మపై ప్రేక్షకులకి వున్న 'నమ్మకానికి' ఇలాంటి కాంట్రవర్సీ కూడా వర్కవుట్‌ అవ్వకపోవచ్చునని గుసగుసలాడుకుంటున్నారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ఈ ఎపిసోడ్స్‌ వుండవు కనుక తన సినిమాకే ఎక్కువ క్రేజ్‌ వుంటుందని వర్మ నమ్మకం. అయితే చీప్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌తో ముఖం తెలియని ఆర్టిస్టులతో మానేసి కాస్త ఆకర్షణలు జోడిస్తే కానీ చేరదు లక్ష్యం.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English