త్రివిక్రమ్‌ ఇప్పుడైనా న్యాయం చేస్తాడా?

త్రివిక్రమ్‌ ఇప్పుడైనా న్యాయం చేస్తాడా?

కమెడియన్‌ నుంచి హీరోగా మారినప్పుడు సునీల్‌కి తనపై తనకి ఎంత నమ్మకం వుందనేది తెలియదు కానీ హీరో నుంచి మళ్లీ కమెడియన్‌గా తిరిగొచ్చినప్పుడు మాత్రం స్నేహితుడు త్రివిక్రమ్‌ని బాగా నమ్మాడు. ఏ తరుణంలో కమెడియన్‌గా మారినా కానీ త్రివిక్రమ్‌ తనని మళ్లీ బిజీ చేస్తాడని సునీల్‌ భరోసాతో వున్నాడు. కానీ అది 'అరవింద సమేత' చిత్రంతో నెరవేరలేదు. సునీల్‌ ఎంతో నమ్మకంగా చేసిన ఈ చిత్రం తనకి ఏ విధంగాను ప్లస్‌ అవ్వలేదు. 'అమర్‌ అక్బర్‌ ఆంటోని'లో కాస్త నవ్వించే కామెడీనే చేసినా కానీ అది డిజాస్టర్‌ అవడం,

తాను చాలా మంది కమెడియన్లలో ఒక్కడవ్వడం వల్ల ఏమంత రిజిష్టర్‌ కాలేదు. అయితే 'అరవింద సమేత'తో జరిగిన అన్యాయాన్ని ఈసారి సరి చేస్తానని సునీల్‌కి త్రివిక్రమ్‌ మాట ఇచ్చాడట. తన తదుపరి చిత్రంలో తనకోసమే మంచి పాత్ర సృష్టించి కామెడీ బాగా దట్టిస్తానని చెప్పాడట. దీంతో సునీల్‌ ఇప్పుడు ఆ చిత్రం మీద నమ్మకం పెట్టుకున్నాడు. త్రివిక్రమ్‌ సినిమాల్లో కామెడీ తగ్గిపోతోందని, అతని జోకుల్లో పస తగ్గిపోయిందని కామెంట్స్‌ వస్తోన్న నేపథ్యంలో మునుపటి మాదిరిగా మళ్లీ త్రివిక్రమ్‌ మ్యాజిక్‌ చేసి సునీల్‌ని తిరిగి బిజీగా నిలబెట్టగలడంటారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English