లయ కూతురు.. చిన్న ఇలియానా

లయ కూతురు.. చిన్న ఇలియానా

గత రెండు దశాబ్దాల్లో అచ్చ తెలుగు హీరోయిన్లలో అందరి కంటే పెద్ద స్థాయిని అందుకున్నది ఎవరంటే లయ పేరే చెప్పాలి. ‘స్వయం వరం’ సినిమాతో కథానాయికగా పరిచయం అయిన ఈ విజయవాడ అమ్మాయి.. ఒక టైంలో మీడియం రేంజి హీరోలకు మంచి ఛాయిస్‌లా కనిపించింది. ఒక ఆరేడేళ్ల పాటు కథానాయికగా బిజీగా ఉన్న లయ.. ఇంకా అవకాశాలు వస్తుండగానే ఓ ఎన్నారై వైద్యుడిని పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడింది. తర్వాత ఆమె తిరిగి సినిమాల్లోకి వస్తుందని ప్రచారం జరిగింది కానీ.. అలాంటిదేమీ జరగలేదు. అప్పుడప్పుడూ కొన్ని టీవీ కార్యక్రమాల్లో కనిపించిందే తప్ప లయ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ మాత్రం ఇవ్వలేదు. ఐతే ఇప్పుడు లయ కూతురు తెరంగేట్రం చేస్తున్నట్లు సమాచారం.

శుక్రవారం విడుదల కాబోయే ‘అమర్ అక్బర్ ఆంటోని’లో లయ కూతురు ఓ కీలక పాత్ర చేసిందట. ఆ చిన్నారి ఈ సినిమాలో చిన్నప్పటి ఇలియానాగా కనిపిస్తుందట. సినిమాలో చిన్న పిల్లల ఎపిసోడ్ కథలో కీలకంగా ఉంటుందట. మరి లయ కూతురు ఎలా ఉంటుందో.. ఎలా నటిస్తుందో చూడాలి. ‘అమర్ అక్బర్ ఆంటోని’ చాలా వరకు అమెరికాలోనే షూటింగ్ జరుపుకున్న చిత్రం. ఈ కథ నేపథ్యం కూడా అమెరికాదే. అక్కడ షూటింగ్ చేస్తుండగా.. చిన్నమ్మాయి పాత్రకు లోకల్ ఎన్నారై అమ్మాయిని ఎంచుకుందామని చూసి.. ఎవరో చెబితే లయను సంప్రదించారట. ఆమె ఓకే చెప్పి తన కూతురిని ఈ సినిమాలో నటింపజేసిందట. రవితేజ-ఇలియానా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. తమన్ సంగీతాన్నందించాడు. రవితేజ ఇందులో మూడు పాత్రల్లో కనిపించనున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English