రికార్డ్‌ బ్రేకింగ్‌ డిజాస్టర్‌!

రికార్డ్‌ బ్రేకింగ్‌ డిజాస్టర్‌!

థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌ కూడా బాహుబలి మాదిరిగా స్పెషల్‌ సినిమా కాగలదనే నమ్మకం ప్రేక్షకులలో ఎంత వుందో, అమీర్‌ ఖాన్‌ సినిమాని వారు ఎంత గుడ్డిగా నమ్మేసారో అనేదానికి ఇదే ఉదాహరణ. 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌' చిత్రానికి మొదటి రోజు రికార్డ్‌ ఓపెనింగ్‌ వచ్చింది. యాభై రెండు కోట్లకి పైగా నెట్‌ వసూళ్లతో హిందీ సినిమాల్లో కొత్త ఓపెనింగ్‌ డే రికార్డుని సృష్టించింది. అయితే ఈ ఆనందాన్ని ఇటు అమీర్‌ అభిమానులు కానీ అటు నిర్మాతలు కానీ సెలబ్రేట్‌ చేసుకోవడం లేదు. డిజాస్టర్‌ టాక్‌ రావడంతో ఈ వసూళ్ళు త్వరగా పడిపోతాయని, తప్పకుండా భారీ నష్టాలు వస్తాయని అందరికీ తెలుసు.

అందుకే ఈ ఫస్ట్‌ డే రికార్డ్‌కి అంతగా పబ్లిసిటీ కూడా దక్కడం లేదు. మామూలుగా ఇలాంటి రికార్డులు వచ్చినపుడు విపరీతంగా సందడి చేసే ట్రేడ్‌ అనలిస్టులు కూడా దీనిని పట్టించుకోవాల్సిన పని లేదని తేల్చేస్తున్నారు. ఏదేమైనా ఒక మంచి అవకాశాన్ని, బాహుబలిలా మరో సంచలనం చేయగల ఛాన్స్‌ని థగ్స్‌ నిర్మాతలు మిస్‌ చేసుకున్నారు. దీనికి ప్రధానంగా దర్శకుడు విక్టర్‌నే ట్విట్టర్‌లో ట్రోల్‌ చేస్తున్నారు. సాధారణంగా తన సినిమాలకి ప్రశంసలు మాత్రమే వినే అమీర్‌ ఖాన్‌కి ఈ కొత్త అనుభవం ఎలాగుందో కానీ మార్కెటింగ్‌లో మాస్టర్‌ అయినా కానీ ఈసారి మౌనం వహిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English