సినిమా తుస్.. విజయ్ భేష్

సినిమా తుస్.. విజయ్ భేష్

‘నోటా’ సినిమాతో విజయ్ దేవరకొండ కెరీర్ మరో స్థాయికి చేరుతుందని అభిమానులు ఆశించారు. కానీ అది అతడికి ఎంతమాత్రం తగని సినిమా అని తొలి రోజే తేలిపోయింది. తెలుగులో ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఇక్కడితో పోలిస్తే తమిళంలో పరిస్థితి కొంచెం మెరుగు కానీ.. అక్కడ కూడా అంతిమంగా సినిమా ఫ్లాప్ అని తేలేలాగే కనిపిస్తోంది.

విశేషం ఏంటంటే.. తమిళంలో ఈ చిత్రానికి నెగెటివ్ రివ్యూలే వచ్చినప్పటికీ విజయ్‌ను మాత్రం ఎవ్వరూ విమర్శించలేదు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా చూస్తే విజయ్ కోసమే చూడాలని కూడా అన్నారు. ప్రముఖ విమర్శకులందరిదీ ఇదే మాట. విజయ్ నటన అమోఘమని.. అతడిని దర్శకుడు ఆనంద్ శంకరే సరిగా ఉపయోగించుకోలేదని క్రిటిక్స్ అభిప్రాయపడ్డాడు.

దర్శకుడు ఆనంద్ శంకర్ సైతం సినిమా సమీక్షలపై స్పందించాడు. తన సినిమాలో తప్పులు దొర్లాయని అంగీకరించాడు. ఈ సందర్భంగా అతను విజయ్ మీద ప్రశంసలు కురిపించాడు. తాను ‘నోటా’ రివ్యూలన్నీ చదివానని.. కానీ ఎవ్వరు కూడా హీరో విజయ్ గురించి ఒక్క నెగెటివ్ వ్యాఖ్య కూడా చేయలేదని ఆనంద్ చెప్పాడు. ఒక దర్శకుడు తాను ఆశించిన దాని కంటే నటుడు ఎక్కువ చేసినపుడు చాలా సంతోషం కలుగుతుందని.. అలాంటి నటులతో పని చేయడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుందని.. విజయ్ అలాంటి నటుడే అని ఆనంద్ అన్నాడు.

విజయ్‌ను డెరెక్ట్‌ చేయడం నిజంగా గొప్ప అనుభవం అని.. చేసింది కొన్ని సినిమాలే అయినా.. విజయ్‌. సన్నివేశాన్ని అర్థం చేసుకునే తీరు చాలా ప్రత్యేకంగా ఉంటుందని.. అతడి నటన, లుక్స్‌ అన్నీ చక్కగా కుదిరాయని.. విజయ్‌కి అన్నీ సానుకూలంగా జరిగితే భవిష్యత్తులో ఇంకా పెద్ద స్టార్ వుతాడని.. ఎప్పటికీ సినీ పరిశ్రమలో నిలిచిపోతాడని అన్నాడు ఆనంద్. తమిళ సినీ జనాలందరూ దాదాపుగా విజయ్ విషయంలో ఇలాగే స్పందించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English