సమ్మోహనం తర్వాత.. సైకో

సమ్మోహనం తర్వాత.. సైకో

‘సమ్మోహనం’ సినిమాతో నిజంగానే తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహనపరిచింది అదితి రావు హైదరి. అంతకుముందే ఆమె తెలుగు ప్రేక్షకుల్ని మణిరత్నం సినిమా ‘చెలియా’తో పలకరించింది. కానీ ఆ సినిమా ఆడకపోవడంతో తగిన గుర్తింపు రాలేదు. ‘సమ్మోహనం’ సినిమా అదితికి పేరూ తెచ్చింది. విజయమూ అందించింది.

ఈ సినిమా చేస్తుండగానే మణిరత్నం దర్శకత్వంలో ‘నవాబ్’ కూడా ఒప్పుకుందామె. ఆ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత అదితి మరో వైవిధ్యమైన సినిమాకు రెడీ అవుతుండటం విశేషం. తమిళంలో డిఫరెంట్ మూవీస్‌తో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న మిస్కిన్ దర్శకత్వంలో అదితి నటించనుంది.

మాస్క్, పిశాచి, డిటెక్టివ్ లాంటి సినిమాలతో మిస్కిన్ తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం. అతడి సినిమాలు అదో రకంగా ఉంటాయి. కొత్త తరహా సినిమాలు కోరుకునే వాళ్లకు అవి బాగా నచ్చుతాయి. మిస్కిన్ ఇప్పుడు ‘సైకో’ అనే సినిమా తీయబోతున్నాడు. కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. అతడికి జోడీగా అదితి నటించనుంది. ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.. గ్రేట్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ పని చేస్తుండటం విశేషం. చాలా ఆసక్తికరమైన కాంబినేషన్ కుదిరింది ఈ చిత్రానికి.

విశేషం ఏంటంటే.. తనకు ఒకటికి రెండు సినిమాల్లో అవకాశమిచ్చిన మణిరత్నం గురించి చాలా గొప్పగా చెబుతుంటుంది అదితి. ఆమే కాదు.. మణిరత్నం దర్శకత్వ ప్రతిభను అందరూ పొగివేవాళ్లే.కానీ మణిరత్నం అంటే మిస్కిన్‌కు పడదు. మణిరత్నం తన సినిమాలతో ఒక జనరేషన్‌ను చెడగొట్టాడంటూ ఒక సందర్భంలో మిస్కిన్ విమర్శలు గుప్పించడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు