రాజశేఖర్‌ ఈసారైనా క్యాష్‌ చేసుకుంటాడా?

రాజశేఖర్‌ ఈసారైనా క్యాష్‌ చేసుకుంటాడా?

తనని అందరూ మర్చిపోయినపుడు 'గరుడవేగ'తో మళ్లీ తనకి గుర్తింపు వచ్చిందని రాజశేఖర్‌ ఎక్కువ ఎక్సయిట్‌ అయ్యాడు కానీ అతనికి నిర్మాతగా ఆ చిత్రం లాభాలు తీసుకురాలేదు. తన మార్కెట్‌కి మించిన ఖర్చు వలన రాజశేఖర్‌ నష్టపోయాడు. పెట్టిన డబ్బుల్లో సగానికి పైగా పోయాయని చెప్పుకుంటూ వుంటారు.

అయితే నటుడిగా తన ఉనికిని నిలబెట్టిన ఆ చిత్రంతో రాజశేఖర్‌ రైట్‌ ట్రాక్‌లోకి వచ్చాడు. ఎలాంటి సినిమాలు చేయాలనే దానిపై అతనికి ఇప్పుడు స్పష్టమైన అవగాహన వుంది. అందుకే యువ దర్శకులు చెప్పే కథలు వింటున్నాడు. 'అ' దర్శకుడు ప్రశాంత్‌ వర్మతో మలి చిత్రం 'కల్కి' చేస్తున్నాడు. దీనికి కూడా రాజశేఖర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఎవరైనా బయటి నిర్మాత కోసం చూసి, నిర్మాణంలో రాజీ పడడం కంటే ఇది మేలని అతను భావిస్తున్నాడు.

అయితే ఇప్పటికిప్పుడు రాజశేఖర్‌ మార్కెట్‌ ఏమీ పెరిగిపోదు. ఇది దృష్టిలో వుంచుకుని పది కోట్ల బడ్జెట్‌లో సినిమా తీసినట్టయితే తన డబ్బులు ఎటూ పోవు. అలాగే సినిమా హిట్టయితే కాస్త లాభాలు వెనక వేసుకోవడానికీ ఆస్కారముంటుంది. గరుడవేగకి జరిగిన తప్పు ఏమిటనేది తెలుసుకున్నాడు కనుక ఈసారయినా అతను జాగ్రత్త పడతాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు