త్రివిక్రమ్‌ కాంప్రమైజ్‌ అయిపోయాడా?

త్రివిక్రమ్‌ కాంప్రమైజ్‌ అయిపోయాడా?

'అరవింద సమేత వీర రాఘవ' టీజర్‌కి లక్షల కొద్దీ వ్యూస్‌ వచ్చేస్తున్నాయి కానీ టీజర్‌లోని కంటెంట్‌పై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టైటిల్‌పై తన ముద్ర చాటుకున్న త్రివిక్రమ్‌ టీజర్‌లో మాత్రం తన ఉనికి లేకుండా చేసుకున్నాడు. ఓవర్సీస్‌ బిజినెస్‌ క్లోజ్‌ అవడం వలనే ఇలాంటి టీజర్‌ కట్‌ చేసారనే కామెంట్లు పడుతున్నాయి. లోకల్‌గా డిస్ట్రిబ్యూటర్స్‌ని ఆకట్టుకోవడానికి ఇలా యాక్షన్‌ టీజర్‌ కట్‌ చేసారని, ఓవర్సీస్‌ బిజినెస్‌ అవకపోయినట్టయితే ఇలాంటిది వదిలే వారు కాదని అంటున్నారు.

ఓవర్సీస్‌లో ప్రీమియర్స్‌కి మంచి వసూళ్లు రావాలంటే టీజర్‌, ట్రెయిలర్‌ చాలా బాగుండాలి. కానీ అరవింద సమేత టీజర్‌ అక్కడి ఫ్యామిలీస్‌కి కంగారు పుట్టించేలా వుంది. ఎన్టీఆర్‌తో ఫ్యామిలీ డ్రామా తీస్తానని చెప్పిన త్రివిక్రమ్‌ ఇలా 'దమ్ము'ని తలపించే టీజర్‌ ఎందుకు కట్‌ చేసినట్టు? అజ్ఞాతవాసి తర్వాత తన సామర్ధ్యంపై అనుమానాలు రేకెత్తడంతో ఓపెనింగ్స్‌ కోసం ఎన్టీఆర్‌పై డిపెండ్‌ అయిపోయాడా? మాస్‌ని ఆకట్టుకోవడానికి ఈ విధంగా చేసాడా? లేక బిజినెస్‌ పరంగా ఇంకా బూస్ట్‌ ఇవ్వడం కోసం ఇలాంటిది వదిలాడా?

కారణాలు ఏమైనా కానీ త్రివిక్రమ్‌ బాగా రాజీ పడిపోయాడని మాత్రం ముక్త కంఠంతో వినిపిస్తోంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ని మార్చేయడం దగ్గర్నుంచి, కథని మార్చడం వరకు అన్నిట్లోను రాజీ పడిన త్రివిక్రమ్‌ లో కాన్ఫిడెన్స్‌తో ఈ చిత్రాన్ని ఎలా తీర్చిదిద్దాడనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు