చి.ల.సౌ. చాలా హాట్‌ గురూ

చి.ల.సౌ. చాలా హాట్‌ గురూ

చిత్ర పరిశ్రమలో ఒక చెడు అలవాటుంది. ఎవరైనా ఒకరు ఒక తరహా పాత్రలో పరిచయం కాగానే ఇక వారికి అలాంటి పాత్రలే ఇచ్చేస్తూ వుంటారు. అందుకే మూస ముద్రలోంచి బయట పడిపోవడానికి ఆర్టిస్టులంతా విశ్వ ప్రయత్నం చేస్తుంటారు.

రీసెంట్‌గా రిలీజ్‌ అయిన 'చి.ల.సౌ.' చిత్రంలో రుహానీ శర్మ డీ గ్లామరైజ్డ్‌గా కనిపించింది. ముఖంపై మొటిమలు కనిపించేలా మేకప్‌ లేకుండా మధ్య తరగతి యువతి పాత్రలో కనిపించింది. ఆమె ఎత్తు పళ్ల మీద కూడా ఒక డైలాగ్‌ వుంది. ఆ సినిమా ఫలితం మాట ఎలా వున్నా తనని మళ్లీ అలాంటి పాత్రలకే పరిమితం చేసేస్తారేమోనని భయపడిందో ఏమో తనంతట తానుగా తనలోని హాట్‌ యాంగిల్‌ని ప్రపంచానికి చూపిస్తోంది.

తన సోషల్‌ మీడియా అకౌంట్స్‌ ద్వారా తనకి గ్లామరస్‌గా కనిపించడానికి అభ్యంతరం లేదనే మెసేజ్‌ ఇండస్ట్రీకి పాస్‌ చేస్తోంది. 'చి.ల.సౌ'లో ఒకలా కనిపించిన రుహాని ఈ మోడ్రన్‌ డ్రస్సుల్లో గుర్తు పట్టలేకుండా వుంది. మరి ఆమెలోని ఈ హాట్‌ కోణాన్ని ముందుగా వెండితెరపై ఆవిష్కరించేది ఎవరో, ఎప్పుడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English