‘భారతీయుడు-2’ కోసం అతనొస్తున్నాడు

‘భారతీయుడు-2’ కోసం అతనొస్తున్నాడు

సౌత్ ఇండియన్ సినిమా రేంజ్ గత కొన్నేళ్లలో చాలా పెరిగిపోయింది. ఇప్పుడు ఇక్కడ తయారయ్యే పెద్ద సినిమాలన్నీ పాన్ ఇండియా రిలీజ్ మీద దృష్టిపెడుతున్నాయి. సౌత్ సినిమాకు ఉత్తరాదిన కూడా మంచి గుర్తింపు రావడంతో.. వాటిని మరింతగా వాళ్లకు చేరువ చేసేందుకు దేశం మొత్తానికి పరిచయం ఉన్న నటీనటుల్ని ముఖ్య పాత్రలకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడి ఫిలిం మేకర్స్.

ఏస్ డైరెక్టర్ శంకర్ కూడా అలాగే ఆలోచిస్తున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా శంకర్ తీసిన ‘2.0’లో విలన్ పాత్రను బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చేసిన సంగతి తెలిసిందే. దీని తర్వాత తాను తీయబోయే ‘భారతీయుడు-’లోనూ ఒక బాలీవుడ్ నటుడికి కీలక పాత్ర ఇస్తున్నాడట శంకర్. ఆ నటుడు మరెవరో కాదు.. అజయ్ దేవగణ్.

అక్షయ్ కుమార్ లాగే అజయ్ కూడా ఇంతకుముందు వరకు దక్షిణాది సినిమాల్లో నటించింది లేదు. అసలు అజయ్‌ని ఇక్కడి వాళ్లెవరూ సంప్రదించి కూడా ఉండకపోవచ్చు. ఐతే శంకర్ మాత్రం అజయ్ కోసమే ఒక పాత్ర రాసి.. అతడిని ఎంచుకున్నాడట. ఇది నెగెటివ్ రోలా.. క్యారెక్టర్ రోలా అన్నది తెలియడం లేదు. ప్రస్తుతం శంకర్ ‘2.0’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబరు 29న రిలీజ్ చేయాలనే పట్టుదలతో శంకర్ ఉన్నాడు. దాదాపుగా అదే సమయానికి ‘భారతీయుడు-2’ను మొదలుపెట్టనున్నాడతను.
కమల్ హాసన్ నటించబోయే చివరి సినిమా ఇదే అని భావిస్తున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్లో 20 ఏళ్ల కిందట వచ్చిన ‘భారతీయుడు’ అప్పట్లో సెన్సేషనల్ హిట్టయింది. దానికి కొనసాగింపుగా ప్రస్తుత పరిస్థితుల్ని ప్రతిబింబించేలా ‘భారతీయుడు-2’ ఉంటుందని సమాచారం.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు