మేనేజరే ఆ హీరోని ముంచేసాడా?

మేనేజరే ఆ హీరోని ముంచేసాడా?

చాలా మంది అగ్ర హీరోలకి, యువ హీరోలకి కూడా మేనేజర్‌గా వ్యవహరిస్తూ వారి డేట్స్‌ చూసే ఓ తెలుగు సినీ ప్రముఖుడు, నటుడు ఓ యువ హీరో పతనానికి కారణమయ్యాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన సదరు హీరో అనుభవజ్ఞుడని అతడిని మేనేజర్‌గా పెట్టుకున్నాడట. మొదట్లో బాగానే వున్నా తర్వాత తన ప్రాజెక్టుల ఎంపిక మేనేజర్‌ చేతిలోకి వెళ్లిపోయిందట. ఫలానా సినిమా చేయమంటూ, ఫలానా వారితో డీల్‌ కుదుర్చుకోమంటూ హీరోని గైడ్‌ చేసాడట.

మొదట్లో కథ నచ్చితేనే ఓకే చేసిన ఆ హీరోకి డబ్బు రుచి చూపించి కథల కంటే క్యాష్‌కే ఇంపార్టెన్స్‌ ఇచ్చేలా చేసాడట. కథ వినకుండానే కొన్ని సినిమాలు ఓకే చేసిన సందర్భాలు కూడా వున్నాయట. దాంతో అతనికి పరాజయాలు మొదలయ్యాయి. వరుసగా వచ్చిన పరాజయాల నుంచి అతనిప్పుడు కోలుకోలేకపోతున్నాడు.

ప్రస్తుతం తనతో సినిమా తీయడానికి కూడా నిర్మాతలెవరూ ముందుకి రావడం లేదట. ఆ మేనేజర్‌ వల్లే తనకీ పరిస్థితి వచ్చిందని తెలిసినా కానీ అతడికి వున్న కనక్షన్స్‌ వల్ల ఆ హీరో అతడినేమీ అనలేకపోతున్నాడట. ఈ హీరో పేరు చెప్పి కమీషన్‌ పేరిట సదరు మేనేజర్‌ బాగానే గడించాడని, ప్రస్తుతం ఆ హీరోకి సినిమాలు లేకపోయినా మేనేజర్‌కి వచ్చే నష్టమేం లేదని చెప్పుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు