కటౌట్ ఓకే.. కంటెంట్ ఏదీ?

కటౌట్ ఓకే.. కంటెంట్ ఏదీ?

బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా లాంచ్ అయినప్పటి నుంచి వరసగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కమర్షియల్ ఎంటర్ టెయినర్లే చేస్తూ వచ్చాడు. దాదాపుగా అతడు నటించిన అన్ని సినిమాలకు హైప్ వచ్చింది వాటికి పెట్టిన ఖర్చుతోనే. లేటెస్ట్ గా రిలీజయిన సాక్ష్యం మూవీ కోసంకూడా అతడి మార్కెట్ రేంజ్ కు మించే ఖర్చు పెట్టారు.

శ్రీవాస్ డైరెక్షన్ లో వచ్చిన సాక్ష్యం మూవీ కోసం బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త లుక్ లో కనిపించాడు. కెరీర్ లో తొలిసారి సిక్స్ ప్యాక్ లుక్ ఈ సినిమాలోనే చూపించాడు. ఈ రేంజిలో కండలు పెంచడానికి.. పర్ ఫెక్ట్ సిక్స్ ప్యాక్ రావడానికి  చాలానే కష్టపడ్డాడు. దీనికితోడు ఈ సినిమాలో దుబాయ్ లో ఓ భారీ యాక్షన్ పార్ట్ కూడా తీశారు. అందుకోసం మనోడు జెట్ స్కీయింగ్, శాండ్ బోర్డింగ్, డిజర్ట్ బైకింగ్, నాలుగు చక్రాల ఆల్ టెరైన్ వెహికల్ (ATV) రైడింగ్.. ఇలా చాలా నేర్చుకున్నాడు. రిస్కు తీసుకుని సొంతంగా అన్ని స్టంట్స్ తనే చేశాడు.  కాని ఏం లాభం.. మూవీకి ఇన్ని హంగులు యాడ్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది.

సాక్ష్యం సినిమా కథ ఆకట్టుకునేలా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద అంచనాలు తిరగబడ్డాయ్. ట్రయిలర్ బాగా కట్ చేయడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి ఆసక్తి ఏర్పడగా.. పంచభూతాల కాన్సెప్ట్ అంటూ ప్రచారం చేయడం మరికొంత ప్లస్సయింది. కానీ ఈ సినిమాలో ఉన్నది రొటీన్ రివెంజ్ డ్రామాయే కావడంతో.. ఈ సిక్స్ ప్యాక్ లుక్కులూ.. స్టంట్లూ.. భారీ ఫైట్లు వర్కవుట్ కాలేదు. సినిమాలో కటౌట్ కన్నాపెద్దగా కంటెంట్ ఉండాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు