ఫ్లాప్‌తో మొహం చాటేసిన హీరో

ఫ్లాప్‌తో మొహం చాటేసిన హీరో

కనీసం తన పద్ధతి మార్చుకుని ప్రేమకథ చేస్తే అయినా ప్రేక్షకుల నుంచి స్పందన వస్తుందని సాయి ధరమ్‌ తేజ్‌ ఆశిస్తే 'తేజ్‌' చిత్రం మొహం చూడ్డానికి కూడా ప్రేక్షకులు ఇష్టపడలేదు. ఒక టైమ్‌లో పాతిక కోట్ల మార్కెట్‌ వున్న సాయి ధరమ్‌ తేజ్‌ చిత్రాలకి ఇప్పుడు కనీసం అయిదు కోట్ల షేర్‌ కూడా రావడం లేదు. ఇంటిలిజెంట్‌ చిత్రానికి నాలుగు కోట్ల కంటే తక్కువ షేర్‌ వస్తే, తేజ్‌కి దాని కంటే తక్కువ వసూళ్లు వచ్చాయి.

ఈ వరుస ఫ్లాపులతో అతను బాగా షేక్‌ అయిపోయాడు. ఇప్పటికే ఫ్లాపుల బెంగతో డిప్రెషన్‌కి గురవుతూ లావెక్కిపోతోన్న తేజ్‌కి ఈ చిత్ర పరాజయంతో మరింత మనస్తాపం కలిగిందట. అందుకే ఇక్కడ వుండి తెలిసిన వారి సానుభూతి మాటలు వినడం కంటే అమెరికా వెళ్లిపోయి ఫిజిక్‌ కరక్ట్‌ చేసుకుని రావాలని అక్కడికి వెళ్లిపోయాడట. యుఎస్‌లో ట్రెయినర్లు, డాక్టర్ల సాయంతో బరువు తగ్గడానికి సాయి ధరమ్‌ తేజ్‌ వెళ్లినట్టు సమాచారం.

మూడు నెలల తర్వాత తిరిగి వచ్చి 'చిత్రలహరి' మొదలు పెడతాడట. తేజ్‌ ఫ్లాప్‌ అయిన తర్వాత తదుపరి చేయబోయే చిత్రాల విషయంలో ఇంకా శ్రద్ధ పెడుతూ కొన్ని ఓకే చేసిన కథలు కూడా పక్కన పడేసాడట.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English