అందులో ప్ర‌కాష్ రాజ్.. ఇందులో ఆయ‌న‌

అందులో ప్ర‌కాష్ రాజ్.. ఇందులో ఆయ‌న‌

నిజ జీవిత క‌థ‌ల‌తో సినిమాలు తీసేట‌పుడు కీల‌క పాత్ర‌ల‌కు న‌టీన‌టుల్ని ఎంచుకోవ‌డం స‌వాలే. ఆయా వ్య‌క్తుల పోలిక‌లున్న వాళ్ల‌నే ఎంచుకోవాలి. వాళ్ల నుంచి పాత్ర‌ల‌కు త‌గ్గ‌ నట‌నా రాబ‌ట్టుకోవాలి. ఇది చిన్న విష‌య‌మేమీ కాదు. బ‌యోపిక్ తీయ‌డం ఒకెత్త‌యితే కాస్టింగ్ స‌రిగ్గా ఉండేలా చూసుకోవ‌డం మ‌రో ఎత్తు. స‌రైన కాస్టింగ్ కుదిరితే అక్క‌డే స‌గం ప‌నైపోతుంది. ఈ విష‌యంలో తేడా వ‌స్తే సినిమానే చెడిపోతుంది. ‘మ‌హాన‌టి’సినిమాలో వివిధ పాత్ర‌ల‌కు చిత్ర బృందం న‌టీన‌టుల్ని ఎంచుకున్న వైనం ప్ర‌శంస‌లందుకుంది. ఇక దీని త‌ర్వాత అంద‌రి క‌ళ్లూ ఎన్టీఆర్ బ‌యోపిక్ మీదే ఉన్నాయి. అందులో బాల‌య్య ఎన్టీఆర్ పాత్ర‌లో క‌నిపించనుండ‌గా.. వివిధ పాత్ర‌ల‌కు ఆచితూచి న‌టీన‌టుల్ని ఎంచుకుంటున్నాడు ద‌ర్శ‌కుడు.

ఇందులో నాదెండ్ల భాస్క‌ర‌రావు పాత్ర‌కు స‌చిన్ ఖేద్క‌ర్ పేరు వినిపించింది. ఏఎన్నార్ గాసుమంత్.. సావిత్రిగా కీర్తి సురేష్.. ఇంకా మ‌రికొన్ని పాత్ర‌ల‌కు సంబంధించి వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ముర‌ళీ శ‌ర్మ ఈ చిత్రంలో నిర్మాత చ‌క్ర‌పాణి పాత్ర చేస్తున్న‌ట్లు స‌మాచారం బ‌య‌టికి వ‌చ్చింది. ఇది అధికారిక స‌మాచార‌మే కావ‌డం విశేషం. ‘మ‌హాన‌టి’లో ఇదే పాత్ర‌ను ప్ర‌కాష్ రాజ్ చేశారు. ఆయ‌న ఎంతో చ‌క్క‌గా ఆ పాత్ర‌లో ఒదిగిపోయారు. ఐతే మ‌ళ్లీ ఆయ‌న్నే తీసుకోవ‌డం ఎందుక‌ని ముర‌ళీ శ‌ర్మ వైపు చూశార‌ట‌. ఆయ‌న కూడా సంతోషంగా ఈ పాత్ర ఒప్పుకున్నాడు. కొన్ని రోజుల కింద‌టే ‘య‌న్.టి.ఆర్’చిత్రీక‌ర‌ణ మొద‌లైంది. ఎన్టీఆర్ తొలి సినిమా మ‌న‌దేశంకు సంబంధించిన స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌తో సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు