నిహారిక కోసం పబ్లిసిటీ గిమ్మిక్కులు

నిహారిక కోసం పబ్లిసిటీ గిమ్మిక్కులు

పబ్లిసిటీ కోసం రకరకాల టెక్నిక్కులు.. గిమ్మిక్కులు తప్పనిసరి అయిపోయాయి. అదే తరహా కంటెంట్ ఇస్తున్నా.. కొత్త కొత్త పేర్లతో చిత్ర విచిత్రమైన ప్రచారాలను చేసేందుకు మేకర్స్ బాగానే క్రియేటివిటీ చూపిస్తున్నారు. ఇప్పుడు హ్యాపీ వెడ్డింగ్ అంటూ ఓ సినిమా వస్తోంది. మెగా డాటర్ కొణిదెల నీహారిక నటించిన చిత్రం కావడంతో ఆసక్తి బాగానే ఉంది.

సుమంత్ అశ్విన్- నీహారిక జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రమోషన్ లో భాగంగా రూపొందించిన ఇన్విటేషన్ ను..  జూన్ 21న విడుదల చేయాలని నిర్ణయించిన టీం.. వినూత్నంగా ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పెళ్లికి ఆహ్వానిస్తున్నట్లుగా ప్రెస్ నోట్లు.. ఇన్విటేషన్స్ తయారు చేశారు. ఓ పెళ్లి కుదిరినప్పటి నుంచి పెళ్లి జరిగే క్షణం వరకూ రెండు కుటుంబాల మధ్య ఏం జరిగిందనే కథను దర్శకుడు లక్ష్మణ్ కార్య అద్భుతంగా తీర్చిదిద్దాడని చెబుతుండగా.. పెళ్లి కొడుకు సుమంత్ అశ్విన్- పెళ్లికూతురు నిహారిక.. పెళ్లి పెద్దలు నిర్మాతలు.. పురోహితుడుగా దర్శకుడు అంటూ ఇన్విటేషన్ రూపొందించిన విధానం బాగుంది.

అయితే.. ఇలాగే విచిత్రంగా ప్రచారం చేసేందుకు మహేష్ అండ్ అల్లు అర్జున్ కూడా ట్రై చేశారు. ఫస్ట్ ఓథ్ అంటూ భరత్ అనే నేను మూవీతో మహేష్ ప్రేక్షకుల ముందుకు రాగా.. ఫస్ట్ ఇంపాక్ట్ అంటూ అల్లు అర్జున్ నా పేరు సూర్యకు ప్రచారం చేశారు. అయితే.. మహేష్ ప్రమాణం ఆకట్టుకోగా.. బన్నీ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. మరి ఈ హ్యాపీ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English