కాలా.. కబాలి లాగే

కాలా.. కబాలి లాగే

‘కాలా’ విషయంలో అంచనాలు తప్పలేదు. ఈ సినిమా అనుకున్న ప్రకారమే టాలీవుడ్ బాక్సాఫీస్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ‘కబాలి’తో పోలిస్తే ఇది బెటర్ అన్నా కూడా దీనికి ఓపెనింగ్స్ దారుణంగా వచ్చాయి. గతంలో ఏ రజనీకాంత్ సినిమాకూ లేని విధంగా నామమాత్రపు షేర్ వచ్చింది తొలి రోజు. ఆ తర్వాత కూడా సినిమా పుంజుకోలేదు. తొలి వారాంతంలో ‘కాలా’ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.7 కోట్ల లోపు షేర్ రాబట్టింది. ఐతే ‘కాలా’కు తమిళనాట రెస్పాన్స్ బాగానే ఉంది. ఈ చిత్రానికి అక్కడ మంచి టాకే వచ్చింది. ఓపెనింగ్స్ కూడా బాగున్నాయి. ఒక్క చెన్నై సిటీలో మాత్రమే ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లో రూ.6.8 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. ‘కబాలి’తో పోలిస్తే ఇది తక్కువే కానీ.. దాని తాలూకు నెగెటివ్ ఎఫెక్ట్ దీని మీద బాగా పని చేసిన నేపథ్యంలో ఈ వసూళ్లు గొప్పే.

‘కబాలి’ సినిమాను తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు తిప్పి కొట్టారు. తొలి రోజు ఓపెనింగ్స్ బాగున్నా.. ఆ తర్వాత సినిమా తేలిపోయింది. తెలుగు ప్రేక్షకులే కాదు.. తమిళనాడు అవతల ప్రతి చోటా ‘కబాలి’ నిరాశ పరిచింది. కానీ తమిళ ప్రేక్షకులు మాత్రం ఆ చిత్రాన్ని బాగానే ఆదరించారు. అంచనాలకు తగ్గట్లు లేకపోయినా.. వాళ్లకు ఓకే అనిపించింది. బయ్యర్లు చాలా వరకు సేఫ్ అయ్యారు. రజనీ కెరీర్లో అది హైయెస్ట్ గ్రాసర్‌గా నిలవగలిగింది. ఇప్పుడు ‘కాలా’ కూడా అదే బాటలో సాగేలా ఉంది. చెన్నై అనే కాదు.. తమిళనాడు అంతటా ‘కబాలి’ బాగానే ఆడుతోంది. సమ్మె కారణంగా రెండు నెలల పాటు తమిళ బాక్సాఫీస్ స్లంప్‌లో పడింది. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ‘ఇరుంబుతిరై’ మాత్రమే మంచి వసూళ్లు సాధించింది. రజనీకాంత్ సినిమా రాకతో చాన్నాళ్ల తర్వాత థియేటర్లలో భారీ సందడి నెలకొంది. మొత్తంగా ‘కాలా’ను అక్కడి వాళ్లు బాగానే ఆదరిస్తూ.. ‘కబాలి’ మాదిరే మంచి ఫలితాన్నందించేలా కనిపిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English