రజనీకాంత్‌ హీరోయిన్‌తో వెంకీ రొమాన్స్‌!

రజనీకాంత్‌ హీరోయిన్‌తో వెంకీ రొమాన్స్‌!

రజనీకాంత్‌ 'కాలా' చిత్రంలో ఒక కథానాయికగా నటించిన బాలీవుడ్‌ బ్యూటీ హుమా ఖురేషీ త్వరలో తెలుగు చిత్ర రంగంలో అడుగు పెట్టనుందా? తెలుగు సినీ వర్గాల సమాచారం ప్రకారం హుమా తెలుగు డెబ్యూ దాదాపు ఖాయమైనట్టే. వెంకటేష్‌, నాగచైతన్య హీరోలుగా రూపొందే మల్టీస్టారర్‌ చిత్రంలో వెంకీ సరసన ఏ హీరోయిన్‌ అయితే బాగుంటుందని చాలా పేర్లు పరిశీలించారు.

నయనతార, శ్రియలాంటి వాళ్లు కాకుండా కాంబినేషన్‌ ఫ్రెష్‌గా వుండాలని భావించారు. అందుకే 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపూర్‌' నటి హుమా ఖురేషి అయితే బాగుందని డిసైడయ్యారు. కాలాతో ఎలాగో సౌత్‌లో కూడా పాపులర్‌ అవుతుంది కనుక వెంకీ సరసన ఈమెని పెడితే ప్లస్‌ అవుతుందని భావిస్తున్నారు. మాటలు అయిపోయాయి కానీ ఇంకా ఒప్పందాలపై సంతకాలు అవీ జరగలేదట.

పారితోషికం ఫైనల్‌ చేసుకుని హుమా గురించిన న్యూస్‌ ప్రకటిస్తారట. హుమా కనుక క్లిక్‌ అయిందంటే హీరోయిన్లు దొరక్క అందుబాటులో వున్న ఇద్దరు, ముగ్గురినే రిపీట్‌ చేస్తోన్న సీనియర్‌ హీరోలందరికీ ఒక ఆప్షన్‌ దొరికినట్టే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు