హీరోని తిట్టుకుంటోన్న దర్శకుడు

హీరోని తిట్టుకుంటోన్న దర్శకుడు

వరుసగా రెండు విజయాలనిచ్చిన ఆ దర్శకుడిపై స్టార్‌ హీరోల దృష్టి కూడా పడింది. ఒక స్టార్‌ హీరోతో సినిమా కన్‌ఫర్మ్‌ అయినట్టే అయి అవకాశం చేజారింది. దాంతో విజయాలతో దూసుకుపోతోన్న యువ హీరోతో చిత్రం చేయడానికి ఉత్సాహపడ్డాడు. ఆ హీరో కూడా అతడికి వెంటనే అవకాశమిచ్చేసాడు. కాకపోతే ఆ దర్శకుడు సదరు హీరోకి రాసుకుని వెళ్లిన కథకి అతను చాలా మార్పులు అడిగాడట.

తనకి మాస్‌ ఎలిమెంట్స్‌ కావాలని, యాక్షన్‌ డోస్‌ పెంచాలని కండిషన్‌ పెట్టాడట. హీరోని హర్ట్‌ చేయడం ఇష్టం లేక తనకి ఇష్టం లేకుండానే ఆ దర్శకుడు అతను అడిగిన మార్పులు చేసాడట. సెకండ్‌ హాఫ్‌లో కామెడీ లేదని, కాస్త కామెడీ పెంచుదామని అతను హీరోకి నచ్చచెప్పినా కానీ అతను మాత్రం వినలేదట. చివరకు ఫైట్‌ దృశ్యాలు తీయడం ఇష్టం లేక ఆ దర్శకుడు సెట్స్‌కి కూడా వెళ్లలేదట.

అతను భయపడ్డట్టుగానే సినిమా రిలీజ్‌ అయి ఫ్లాపయింది. ఆ హీరోకి అవకాశాలు దండిగా వున్నాయి కానీ ఇప్పుడు పెద్ద ఫ్లాప్‌ ఇవ్వడంతో ఈ దర్శకుడికి వున్న క్రేజ్‌ బాగా తగ్గింది. మాస్‌ హీరో అయిపోవాలనే హీరో కోరిక తన కెరియర్‌ని ప్రమాదంలో పడేసిందని ఆ దర్శకుడు ఇప్పుడు కనిపించిన వారి దగ్గరల్లా ఆ హీరోని తిట్టి పోస్తున్నాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English