పిక్‌ టాక్: స్ప్రింగులాంటి దిశా

పిక్‌ టాక్: స్ప్రింగులాంటి దిశా

దిశా ప‌టానీ చేసిన‌వి గుప్పెడు సినిమాలే అయినా త‌న గ్లామ‌ర్ లుక్స్ కోట్ల సంఖ్య‌లో అభిమానుల‌ను సంపాదించుకుంది. మెరిసే రంగు కొవ్వు జాడేలేని శ‌రీరం డ్యాన్సు చేస్తుంటే స్ర్పింగు బొమ్మ‌లా అనిపించ‌డం ఖాయం. వ‌రుణ్‌తేజ్‌తో లోఫ‌ర్ సినిమాలో ఆడిపాడింది ఈ ముద్ద‌గుమ్మ‌. తాను డ్యాన్సు చేస్తున్న ఓ ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేసి కుర్ర‌కారులో కాక రేపుతోంది. ఆ ఫోటోకు అప్పుడే నాలుగు ల‌క్ష‌ల‌కు పైగా లైకులు ప‌డ్డాయి.

సినిమాల క‌న్నా టైగ‌ర్ ష్రాఫ్ తో  చెట్టాప‌ట్టాలేసుకుని తిర‌గ‌డం వ‌ల్లే ఎక్కువ పాపుల‌ర్ అయ్యింది దిశా ప‌టానీ. వీరిద్ద‌రూ క‌లిసి న‌టించింది ఒకే సినిమా అయిన‌ప్ప‌టికీ వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో జ‌రుగుతోందంటూ బాలీవుడ్ జ‌నాలు ఒక‌టే గుస‌గుస‌. ముంబైలో ఎక్క‌డికెళ్లినా జంట‌గానే వెళ్తుండ‌డంతో ఆ గుస‌గుసలు మ‌రీ పెరిగాయి. ఇద్ద‌రూ విదేశాల‌కు షికార్ల‌కు పోవ‌డం... అక్క‌డ హాట్ హాట్ ఫోజుల‌తో ఫోటోలు దిగ‌డం వాటినీ ఆన్‌లైన్‌లో పెట్ట‌డం ఇవ‌న్నీ వారిద్ద‌రి మ‌ధ్య ఎఫైర్ ఉంద‌ని చెప్ప‌క‌నే చెప్పేశాయి. కానీ టైగ‌ర్ ష్రాఫ్ మాత్రం త‌మ మ‌ధ్య ఏం లేద‌ని తేల్చి చెప్పాడు. చెప్ప‌డ‌మైతే చెప్పాడు కానీ జంట‌గా తిర‌గ‌డం మాత్రం ఆప‌లేదు. ఈ నేప‌థ్యంలోనే దిశా ప‌టానీ ఏ స్టార్ హీరోయిన్‌కు లేనంత క్రేజ్ యూత్‌లో వ‌చ్చేసింది. ఆమె ఫోటో పెడితే చాలు వెర్రెక్కిపోయే అభిమానులు ఉన్నారు.

ట్రాక్ ప్యాంటులో స్టైల్‌గా న‌డుముకు క‌ట్టుకున్న ష‌ర్టుతో  పుమా ఇండియా కోసం ఓ యాడ్లో ఆమె న‌టించింది. ఆ యాడ్లో డ్యాన్సు మూమెంట్‌ను ఫోటో తీసి ఇన్ స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేసింది. విల్లులా వంగి పోయే ఒళ్లుతో దిశా సింపుల్ అండ్ బ్యూటీఫుల్ అనిపించేలా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు