ఆ లిప్ లాక్ గురించి సమంత ఓపెనైంది

ఆ లిప్ లాక్ గురించి సమంత ఓపెనైంది

తెలుగు సినిమాల్లో గతంలో పోలిస్తే లిప్ లాక్ సీన్స్ పెరిగినప్పటికీ.. వాటి విషయంలో ఇంకా జనాలు ఆశ్చర్యపోతూనే ఉంటారు. మామూలు హీరోయిన్ల పెదవి ముద్దుకే ఆశ్చర్యపోతుంటే.. ఇక పెళ్లయిన కథానాయికలు లిప్ లాక్ చేస్తే ఇక షాకవ్వకుండా ఎలా ఉంటారు..? అందులోనూ అక్కినేని వారి కోడలు సమంత లిప్ లాక్ సీన్ చేయడంతో ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. సమంత అలా ఎలా ఒప్పేసుకుందని ఆశ్చర్యపోయారు. ఐతే దీని గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో సమంత ఓపెన్ అయింది. ఆ లిప్ లాక్ సీన్ వెనుక అసలు సీక్రెట్ ఏంటో చెప్పేసింది.

నిజానికి ఆ సన్నివేశంలో సమంత ముద్దు పెట్టింది చరణ్ బుగ్గ మీదట. ఐతే కెమెరా ట్రిక్ ద్వారా ఆమె లిప్ లాక్ చేసినట్లుగా భ్రమింపజేశారట. ఈ విషయం చెబుతూనే అసలు పెళ్లయిన హీరోయిన్లు లిప్ లాక్ చేస్తే తప్పేంటి అని సమంత ప్రశ్నించింది. పెళ్లయిన హీరోలు లిప్ లాక్ సీన్లలో నటించట్లేదా..? మరి వారి విషయంలో అభ్యంతరాలు లేనపుడు..పెళ్లయిన హీరోయిన్లకు మాత్రం రిస్ట్రిక్షన్లు ఎందుకని ఆమె అడిగింది.

హీరోయిన్ల కెరీర్లకు పెళ్లితో ముడి పెట్టకూడదని అభిప్రాయపడిన సమంత.. అలాంటి హీరోయిన్లకు ఎప్పట్లాగే అవకాశాలివ్వాలని కోరింది. ‘రంగస్థలం’తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న సమంత.. తమిళంలో రెండు సినిమాలతో త్వరలోనే ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. తెలుగులో ఆమె నాగచైతన్య సరసన ఒక సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు