ఆ ట్రాక్ కు క‌త్తెర వేయ‌మ‌న్న బ‌న్నీ?

ఆ ట్రాక్ కు క‌త్తెర వేయ‌మ‌న్న బ‌న్నీ?

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ ఎవైటెడ్ సినిమా నా పేరు సూర్య‌. ఇందులో అల్లు అర్జున్ తొలిసారి ఆర్మీ అధికారిక‌గా క‌నిపిస్తున్నాడు. అత‌ని లుక్ ఇప్ప‌టికే అభిమానుల‌కు తెగ‌న‌చ్చేసింది. ఇటు మాస్... అటు క్లాస్ వారిని కూడా అల‌రించే విధంగా అత‌ని లుక్ ను తీర్చిదిద్దారు. ఈ సినిమా దాదాపు పూర్త‌యింది. సినిమా ర‌షెస్ చూసిన బ‌న్నీ... ఓ విష‌యంలో మాత్రం అసంతృప్తిగా ఉన్నాడ‌ట‌. కొన్ని సీన్ల‌కు క‌త్తెర వేయ‌మ‌ని చెబుతున్నాడ‌ట‌.

నా పేరు సూర్య‌లో దేశం కోసం పోరాడే సైనికుడిగా... అలాగే ప్రేమ‌ను గెలిపించుకునే ప్రేమికుడిగా క‌నిపించ‌బోతున్నాడు ఈ మెగా హీరో. అయితే సినిమా కథ ప్ర‌ధానంగా దేశ‌భ‌క్తి మీదే ఆధార‌ప‌డి ఉన్న‌ట్టు స‌మాచారం. ర‌షెస్ చూసిన‌ అల్లు అర్జున్ ఓవ‌రాల్ గా చాలా బాగున్న‌ట్టు ఫీల‌య్యాడ‌ట‌. కానీ కొన్ని సీన్లు మాత్రం న‌చ్చ‌లేన‌ట్టు చెప్పాడ‌ట‌. ల‌వ్ సీన్ల‌కు ఎక్కువ స‌మ‌యాన్ని కేటాయించ‌డం... సినిమా ఫ్లో దెబ్బ‌తినేలా ఉంద‌ని అభిప్రాయప‌డ్డాడ‌ట‌. అందుకే  ల‌వ్ సీన్ల‌కు క‌త్తెర వేయ‌మ‌ని చెప్పాడ‌టని తెలుస్తోంది. అందుకు ద‌ర్శ‌కుడు కూడా అంగీక‌రించిన‌ట్టు స‌మాచారం. సినిమా క‌థ‌లో... ప్రేమ స‌న్నివేశాలు చిన్న భాగ‌మే త‌ప్ప అది క‌థను డీవియేట్ చేసేలా ఉండ‌కూడ‌ద‌ని బ‌న్నీ చెప్పాడ‌ట‌.

నా పేరు సూర్య సినిమా ద్వారా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. ఇంత‌వ‌ర‌కు అత‌ను టాప్ రైట‌ర్‌గా టాలీవుడ్‌లో కొన‌సాగాడు. మొద‌టి షెడ్యూల్ లో అత‌ని టేకింగ్ చూసి అల్లు అర్జున్ చాలా ఆశ్చ‌ర్య‌పోయాడ‌ట‌. అత‌నిపై బాగా న‌మ్మ‌కం కుదిరి... పూర్తి స్వేచ్ఛ‌ను ఇచ్చాడ‌ట‌. ఈ సినిమాలో బ‌న్నీ ప‌క్క‌న అను ఇమ్మాన్యుయేల్ న‌టిస్తోంది. మే 4న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు