సూర్య కొత్త లుక్ చూశారా?

సూర్య కొత్త లుక్ చూశారా?

కొందరు హీరోలు.. కొందరు దర్శకులు కలిస్తే ఆ కాంబినేషన్‌కు వచ్చే క్రేజ్ వేరుగా ఉంటుంది. తమిళంలో అలాంటి కాంబినేషన్లోనే ఓ సినిమా తెరకెక్కుతోంది. కెరీర్ ఆరంభం నుంచి విలక్షణ చిత్రాలతో విభిన్నమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సెల్వ రాఘవన్ దర్శకత్వంలో.. తన అద్భుతమైన నటనతో భాషా భేదం లేకుండా సౌత్ ఇండియా అంతటా ఫాలోయింగ్ సంపాదించిన సూర్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సెల్వ రాఘవన్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న సాయంత్రం ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఇందులో సూర్య లుక్ సూపర్బ్ అనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. సూర్య ఇందులో విప్లవ నాయకుడు చేగువేరాలా కనిపిస్తున్నాడు. గడ్డం.. నెత్తిన టోపీ చేగువేరానే గుర్తుకు తెస్తున్నాయి. ఈ చిత్రానికి ‘ఎన్.జి.కె’ అనే వెరైటీ టైటిల్ పెట్టారు. గత కొన్నేళ్లలో సెల్వ రాఘవన్ ట్రాక్ రికార్డు ఏమంత గొప్పగా లేదు. అతను చివరగా తీసిన ‘నెంజమ్ మరప్పుదిల్లై’ విడుదలకే నోచుకోకుండా ఆగిపోయింది. ఇలాంటి టైంలో సూర్య లాంటి పెద్ద హీరో అతడితో సినిమా చేయడానికి ముందుకు రావడం విశేషం.

ఈ చిత్రానికి సెల్వ ఆస్థాన సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజానే సంగీతాన్నందిస్తున్నాడు. సెల్వ కెరీర్లో క్లాసిక్ లా నిలిచిపోయిన ‘పుదుపేట్టై’ తరహా సినిమా ఇదని.. ఇది కూడా ఒక క్లాసిక్ అవుతుందని యువన్ అంటున్నాడు. సూర్య గత సినిమాల్లాగే ఇది కూడా ఒకేసారి తెలుగులోనూ విడుదల కానుంది. మరి తెలుగు వెర్షన్‌కు ‘ఎన్.జి.కె’ అనే టైటిలే పెడతారో.. వేరే ఏమైనా పేరు ట్రై చేస్తారా అన్నది చూడాలి.