ఈ రేటంతా పూజ మాయేనా?

ఈ రేటంతా పూజ మాయేనా?

సినిమా చిన్నది అయితే థియేటర్స్ లో వచ్చే కలెక్షన్స్, ప్రేక్షకుల టాక్ మీదనే టీవీ రైట్స్ ఆధారపడతాయి. కానీ పెద్ద సినిమా లకి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే రిలీజ్ కు ముందే టీవీ చానెల్స్ వాటి సాటిలైట్ రైట్స్ అంటూ ప్రొడ్యూసర్లు ముందే కొంత జేబు నింపేసుకుంటారు. కానీ ఇప్పుడు ఒక మీడియం హీరో సినిమా విషయంలో కూడా అదే జరిగింది.

నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడి గా ఇండస్ట్రీ లోకి అడుగు మోపిన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా మూడు సినిమాలు చేశాడు. మొదట పెద్దగా మెప్పించలేకపోయినా జయ జానకి నాయక తో ఓ మోస్తరు హిట్ ని నమోదు చేసుకుని ప్రేక్షకుల చూపుని తన వైపు తిప్పుకున్నాడు. కానీ సినిమా ఒక రకంగా రకుల్ వల్ల మరియు బోయపాటి యాక్షన్ సీన్స్ టేకింగ్ వల్ల హిట్ అయింది అని చెప్పుకోవచ్చు. అందుకే బెల్లంకొండ తరువాయి సినిమా మీద పెద్ద అంచనాలు ఏమి పెట్టుకోలేదు జనాలు. కానీ ఇప్పుడు మాత్రం సినిమా పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. హిందీ లో సాటిలైట్ రైట్స్ 8 కోట్లు పలుకగా తెలుగులో జీ తెలుగు ఛానల్ సినిమాకు 5.5 కోట్లు కట్టి డీల్ క్లోజ్ చేసింది. అయినా సాటిలైట్ రైట్స్ కి ఇంతా అంటూ ప్రేక్షకులు నోరు తెరుస్తున్నారు. 'సాక్ష్యం' అనే సినిమా తో మన ముందుకు రాబోతున్న బెల్లంకొండ వారసుడు ఈ సినిమాలో దువ్వడా జగన్నాధం బ్యూటీ పూజ హెగ్డే తో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ సినిమా ఇంత రేట్ ఎందుకు పలికిందబ్బా అంటే కారణం మాత్రం పూజ హెగ్డే అంటున్నారు జనాలు.

అయితే ఈ మధ్య కాలంలో ప్రతీ సినిమాకు దాదాపు 10 కోట్ల వరకు అన్ని రైట్స్ పలికేస్తున్నాయి. పెద్ద పెద్ద డిజిటల్ ప్లేయర్స్ రావడం.. నార్త్ లో మన మసాలా సినిమాలకు డిమాండ్ బాగా పెరగడంతో.. ఈ రేటు మామూలుగానే వచ్చేస్తోంది. అందులోని సినిమా తీసిన దర్శకుడు శ్రీవాస్.. నార్త్ కు నచ్చే మసాలా సినిమాలను తీయడంలో పేరుగాంచాడు. సినిమాలు ఇక్కడ ఫ్లాపైనా కూడా అక్కడ ఆడుతున్నాయి. కాబట్టి అనేక కారణాలు అలా కలిసొచ్చాయి అని చెప్పుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు