గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిన ప‌వ‌న్ హీరోయిన్

గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిన ప‌వ‌న్ హీరోయిన్

గ్లామ‌ర్ ఫీల్డ్ లోని భామ‌లు ఒక విష‌యంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటారు. వ‌య‌సు మీద ప‌డినా.. ఆ ఛాయ‌లు క‌నిపించ‌కుండా కేర్ తీసుకుంటారు. చాలామందైతే.. వ‌య‌సు పెరిగే కొద్దీ మ‌రింత అందంగా క‌నిపిస్తుంటూ చ‌క్కిలిగింత‌లు పెడుతుంటారు. గ్లామ‌ర్ ఫీల్డ్ లో ఉన్న భామ‌లంతా దాదాపుగా ఇలాంటి ప‌రిస్థితే ఉంటుంది. కానీ.. కొంద‌రు మాత్రం ఇందుకు మిన‌హాయింపు.

ఒక‌ప్పుడు తాము కోట్లాదిమంది మ‌న‌సుల్ని దోచుకున్నామ‌న్న విష‌యాన్ని ప‌ట్టించుకోరు. త‌మ‌ను తాము పూర్తిగా మార్చేసుకోవ‌ట‌మే కాదు.. గుర్తు ప‌ట్ట‌లేని రీతిలో మారిపోతారు. స‌గ‌టు జీవుల్లా వ‌య‌సుతో వ‌చ్చే మార్పుల‌తో ఉండిపోతారు. అలాంటి వారి జాబితాలో చేరింది ప‌వ‌న్ హీరోయిన్‌.

క‌ళ‌క‌ళ‌లాడే ముఖంతో.. కొన్ని పాత్ర‌ల‌కు మాత్ర‌మే సూట్ అయ్యేట‌ట్లు ఉన్నా.. యూత్ మ‌న‌సుల్లో త‌న‌దైన ముద్ర వేసిన భామ‌ల్లో మీరా జాస్మిన్ ఒక‌రు. ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న గుడుంబా శంక‌ర్ చిత్రంలో ఆమె క‌ళ్ల‌తో ప‌లికించే భావాలు చ‌క్కిలిగింత‌లు పెడుతుంటాయి. ర‌వితేజ‌తో భ‌ద్ర తో పాటు.. గోరింటాకు.. రారాజు త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది.
టాలీవుడ్‌లో మంచి పేరే తెచ్చుకున్నా.. సెలెక్టివ్ గానే ఉండేవార‌న్న పేరుంది.

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మంచి పేరున్న ద‌శ‌లోనే ఆమె ఓ ఏన్నారైని పెళ్లి చేసుకొని ఫారిన్ వెళ్లిపోయారు. దీంతో.. ఆమెకు.. ప‌రిశ్ర‌మ‌కు లింక్ తెగిపోయింది.ఇదిలా ఉంటే.. తాజాగా ఓ షాపింగ్ మాల్‌కు వ‌చ్చారు. బొండుమ‌ల్లిలా ఉండే మీరా.. ఇప్పుడు అస్స‌లు గుర్తు ప‌ట్ట‌లేన‌ట్లుగా త‌యార‌య్యారు.

తాను మీరా జాస్మిన్ అని చెబితే వెంట‌నే గుర్తు ప‌ట్ట‌లేని రీతిలో ఆమె మారిపోయారు. స్థూల‌కాయంతో పాటు.. ముఖంలో కూడా మార్పులు వ‌చ్చాయి. షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వ‌చ్చిన సంద‌ర్భంగా తీసిన ఫోటోలు చూసి.. ఈమేనా నాటి మీరా అంటూ నెటిజ‌న్లు నిట్టూర్పులు వ‌దులుతున్నారు. ఏమైనా.. త‌న స‌ర్ ప్రైజ్ లుక్ తో మీరా షాకిచ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు