ఒకే రోజు సమంతవి రెండు సినిమాలు

ఒకే రోజు సమంతవి రెండు సినిమాలు

పెళ్ల‌యిన త‌రువాత మ‌రింత‌గా దూసుకెళ్లిపోతోంది స‌మంత‌. పెళ్లిని కెరీర్‌తో ముడిపెట్ట‌కుండా త‌న‌దైన దారిలో సినిమాలు చేసుకుంటూ పోతోంది. తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీల‌లో అక్కినేని ఇంటి వారి కోడ‌లి హ‌వా ఇంకా త‌గ్గ‌డం లేదు. అందుకు మార్చి 29 తేదీనే ఉదాహ‌ర‌ణ‌.

స‌మంత తెలుగులో చేస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం రంగస్థలం. అందులో ఓ డిఫ‌రెంట్ పాత్ర‌లో క‌నిపించ‌బోతోంద‌ట సామ్‌. చెర్రీ న‌ట‌న‌కు ధీటుగా త‌న న‌ట‌న‌తోనే స‌మాధానం చెబుతుంద‌ని అంటున్నారు రంగ‌స్థ‌లం షూటింగ్ చూసిన సినీ జ‌నాలు. మొన్న విడుద‌లైన ట్రైల‌ర్ లో సామ్ ని చూపించ‌లేదు క‌నుక‌... మ‌న‌కు ఆమె పాత్ర ఎలా ఉంటుందో తెలియ‌దు. ఆ సినిమాను మార్చి 29న విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్‌. అదే రోజు... స‌మంత మ‌రో మూవీ కూడా థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. త‌మిళ స్టార్ విశాల్ పక్కన అభిమ‌న్యుడు సినిమాలో ఆమె న‌టించింది. ఆ సినిమా విడుద‌ల కూడా మార్చి 29నే.

విశాల్ చిత్ర యూనిట్ ఆ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా  ప్ర‌క‌టించారు. అభిమన్యుడు మార్చి 29న థియేటర్ల‌లోకి వస్తున్నప్పుడే.. రంగస్థలం రచ్చ కూడా తెలుగు రాష్ట్రాల్లో పీక్స్ లో ఉంటుంది. దీంతో సామ్ అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. ఒకే రోజు రెండు సినిమాల రిలీజ్ అంటే మాటలుకాదుగా మ‌రి. అయితే శామ్ ఏ సినిమా గట్టిగా ప్రమోట్ చేస్తుందో చూడాల్సిన విషయమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు