శ్రియను కౌగిలించుకోవాలనుకున్నా-మోహన్ బాబు

శ్రియను కౌగిలించుకోవాలనుకున్నా-మోహన్ బాబు

ఎప్పుడు చాలా సీరియస్‌గా కనిపించే మోహన్ బాబు.. ‘గాయత్రి’ ఆడియో వేడుకలో తనలోని మరో కోణం చూపించాడు. చాలా సరదాగా.. చమత్కారంగా.. కొంటెగా మాట్లాడుతూ అందరి దృష్టినీ ఆకర్షించారు. ‘గాయత్రి’లో కీలక పాత్రలు పోషించిన శ్రియ, అనసూయల మీద ఆయన చేసిన కామెంట్లు ఆసక్తి రేకెత్తించాయి. ఈ సినిమాలో శ్రియ అద్భుతంగా నటించిందని.. ఆ పాత్రలో ఇంకొకరిని ఊహించుకోలేమని.. ఆమె తప్ప ఇంకెవరూ ఈ పాత్రకు న్యాయం చేయలేరేమో అనిపించిందని మోహన్ బాబు చెప్పాడు. విష్ణు-శ్రియ ఎపిసోడ్ చూసినపుడల్లా తనకు కళ్లల్లో నీళ్లు తిరిగాయన్న మోహన్ బాబు.. ఆ సన్నివేశాల్లో విష్ణు.. శ్రియ ఒకరినొకరు డామినేట్ చేశారని అన్నారు.

ఇక శ్రియను చూస్తే తనకు కౌగిలించుకోవాలని అనిపిస్తోందని.. కానీ విష్ణుకు ఆమె జోడీగా నటించడం వల్ల అలా చేయట్లేదని.. ఐతే తాను అనసూయను కౌగిలించుకోవచ్చని మోహన్ బాబు చమత్కరించడం విశేషం. తన గురించి మోహన్ బాబు మాట్లాడుతున్నపుడు ఆయన దగ్గరికి శ్రియ రాగా.. కొంతసేపయ్యాక ఇక నువ్వు నా పక్కనుంటే బాగుండదు.. వెళ్లి విష్ణు పక్కన నిలుచోమ్మా అంటూ మోహన్ బాబు మరో పంచ్ వేయడం విశేషం.

తర్వాత అనసూయ గురించి చెబుతూ.. ఆమె తనను బావ గారూ అని సంబోధించడం సంతోషంగా ఉందన్నారు. తనకు ప్రతి సినిమా షూటింగ్ టైంలోనూ ఎవరో ఒకరితో గొడవ అవుతుందని.. ‘గాయత్రి’ చేసేటపుడు అనసూయతో గొడవ పెట్టడానికి చాలా మంది ఆమె గురించి కంప్లైంట్లు చేశారని.. ఐతే విష్ణు తన దగ్గరికి వచ్చి ఆమె చాలా మంచి అమ్మాయని.. ప్రొఫెషనల్ అని చెప్పాడని మోహన్ బాబు అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు