పోలీస్‌..ఆఁ.ఆఁ.. బాగా ఫీలయ్యాడు

పోలీస్‌..ఆఁ.ఆఁ.. బాగా ఫీలయ్యాడు

కనిపించే ఆ మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే, కనిపంచన ఆ నాలుగో సింహమేరా పోలీస్‌...ఆఁ...ఆఁ...ఆ..ఆ..!!! మొత్తానికి మీకు బేస్‌ వాయిస్‌తో చితక్కొటేసే సాయికుమార్‌ గుర్తొచ్చుండాలే. ప్రస్తుతం మనోడు ఒక విషయంలో బాగా ఫీలవ్వుతున్నాడట.

తన కొడుకు ఆది హీరోగా వచ్చిన తాజా చిత్రం 'సుకుమారుడు' బాక్సాఫీస్‌ దగ్గర అట్టర్‌ఫ్లాప్‌ కావడంతో దానిని మనోడు జీర్ణించుకోలేకపోతున్నాడు. విమర్శకులే దగ్గరుండి మరీ సినిమాను తొక్కేశారని వీళ్ళపై విరుచుకుపడుతున్నాడట. పబ్లిక్‌గా ఏమీ అనకపోయిన, తన ఆప్తుల దగ్గర మాత్రం బూతులు చిట్లా విప్పేస్తున్నాడట.

అయినా సినిమా బాగా తియ్యకపోతే అది విమర్శకుల తప్పెందువుతుంది? అంటే ఇక్కడ ఒక పాయింట్‌ చెప్పాలి. ఆది చేసిన మొదటి రెండు సినిమాల్లో కూడా పెద్దగా విషయం లేకపోయినా, వాటిని సూపర్‌ అంటూ కొంతమంది పొగిడేశారు లేండి. ఆ పొగడ్తలన్నీ నిజమనుకున్న సాయికుమార్‌ ఇప్పుడు ఒక్కసారిగా ఈ కొత్తసినిమాను విమర్శిస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. అదీ పోలీస్‌ గారి కత!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు