రంగస్థలంలో చరణ్‌ స్టెప్పులు రచ్చ

రంగస్థలంలో చరణ్‌ స్టెప్పులు రచ్చ

ప్రస్తుతం టాలీవుడ్ లో డ్యాన్సులకు ఇంపార్టెన్స్ తెగ పెరిగిపోయింది. స్టార్ హీరోలలో అనేక మంది తమ స్టెప్పులతో అలరించేస్తున్నారు. మెగాస్టార్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వడంతో పాటు.. జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్.. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో డ్యాన్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో తెలిసిందే. రామ్.. నితిన్ లాంటి యంగ్ హీరోస్ కూడా డ్యాన్సులు ఇరగదీస్తూనే ఉంటారు.

డ్యాన్స్ మాస్టర్లకు తెగ డిమాండ్ పెరిగిన తరుణంలో.. తనదైన స్టైల్ తో దూసుకుపోతున్నాడు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. టీవీ షోల కారణంగా ఆడియన్స్ కు కూడా ఈయన బాగానే తెలుసు. శేఖర్ అందించే స్టెప్పులకు పలువురు హీరోలు ఫిదా అయిపోయారనే చెప్పాలి. ప్రస్తుతం రామ్ చరణ్ మూవీ రంగస్థలంలో ఓ సూపర్బ్ సాంగ్ కు నృత్య రీతులు సమకూర్చానని చెబుతున్నాడు శేఖర్ మాస్టర్. సినిమాకు కీలకమైన సన్నివేశంలో వచ్చే ఈ పాట.. లిరికల్ గా కూడా బాగా ఆకట్టుకుంటుందని.. రామ్ చరణ్ అద్భుతమైన మూమెంట్స్ తో అలరిస్తాడని.. అభిమానులకు ఆ స్టెప్పులు రచ్చ అంటున్నాడు.

గతంలో ఎవడు చిత్రంలో పింపుల్ డింపుల్ పాటకు.. అలాగే బ్రూస్ లీ మూవీలో మెగా మీటర్ పాటకు గాను.. డ్యాన్స్ కంపోజ్ చేశాడు శేఖర్ మాస్టర్. ఎన్టీఆర్ చిత్రాలలో పాటలకు ఎక్కువగా కంపోజ్ చేశానని.. ప్రతీ సినిమాలో ఒకట్రెండు పాటలను తనతో చేయించాలని ఎన్టీఆర్ పట్టుబడుతుండడాన్ని.. బాధ్యతగా భావిస్తానని చెబుతున్నాడు ఈ కొరియోగ్రాఫర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు