`అజ్ఞాత‌వాసి` నైజాం రైట్స్ కు అదిరిపోయే ధ‌ర‌?

`అజ్ఞాత‌వాసి` నైజాం రైట్స్ కు అదిరిపోయే ధ‌ర‌?

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌మంతా న్యూ ఈయ‌ర్ జోష్ లో మునిగిపోయింది. అయితే, ప‌వ‌న్ అభిమానుల‌కు మాత్రం న్యూ ఈయ‌ర్ జోష్ తో పాటు `అజ్ఞాత‌వాసి` సినిమా మ‌రింత జోష్ ను ఇచ్చింది. నిన్న సాయంత్రం ప‌వ‌న్ క‌ల్యాణ్ పాడిన `కొడ‌కా....కోటేశ్వ‌ర్ రావు` పాట ప‌వ‌న్ ఫ్యాన్స్ కు స‌రి`కొత్త` కిక్ ఇచ్చింది. త్రివిక్ర‌మ్, ప‌వ‌న్ ల కాంబోలో వ‌స్తోన్న ఈ సినిమా కోసం ప‌వ‌న్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. ఈ నెల 9న ఓవ‌ర్సీస్ లో `అజ్ఞాత‌వాసి` ప్ర‌యాణం రికార్డు స్థాయిలో మొద‌లు కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ మోస్ట్ అవెయిటెడ్ సినిమా హ‌క్కుల కోసం గ‌ట్టి పోటీ ఏర్ప‌డింద‌ట‌. తాజాగా, ఈ చిత్రం నైజామ్ హ‌క్కులు రికార్డు స్థాయి ధ‌ర ప‌లికిన‌ట్లు తెలుస్తోంది.

ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ ఎక్కువ స‌మ‌యం రాజ‌కీయాల కోసం కేటాయించ‌బోతున్నాడ‌ని వార్త‌లు రావ‌డంతోపాటు....ప‌వ‌న్-త్రివిక్ర‌మ్ ల క్రేజీ కాంబోలో రాబోతోన్న హ్యాట్రిక్ మూవీ కావ‌డంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. దీంతో, ఈ సినిమాపై డిస్ట్రి బ్యూషన్ వర్గాల్లో కూడా మంచి డిమాండ్ ఏర్ప‌డింది. ఈ చిత్రం నైజామ్ రైట్స్  రూ.27 కోట్లకు అమ్ముడైనట్టుగా ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నా. కేవ‌లం, నైజామ్ లోనే ఈ స్థాయి రేటు పలకడంపై ట్రేడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుతోందట‌. నైజాంలోనే ఈ రేటు ప‌లికితే, ఇక మిగతా ప్రాంతాల్లో హ‌క్కులు,  ఓవ‌ర్సీస్, శాటిలైట్, డిజిట‌ల్  రైట్స్ ఏ స్థాయిలో అమ్ముడై ఉంటాయో అని చ‌ర్చించుకుంటున్నార‌ట‌. విడుద‌ల‌కు ముందే ఇంత హైప్ క్రియేట్ చేసుకున్ `అజ్ఞాత‌వాసి` ....విడుద‌ల‌య్యాక మ‌రెంత సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో అని అనుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు