న్యూఇయ‌ర్ వేళ‌.. విక్రం ఇంట విషాదం

న్యూఇయ‌ర్ వేళ‌.. విక్రం ఇంట విషాదం

కొత్త సంవ‌త్స‌రం వేళ అంతా హ్యాపీగా ఉన్న స‌మ‌యంలో ప్ర‌ముఖ హీరో విక్రం ఇంట ఊహించ‌ని విషాదం చోటు చేసుకుంది. తమిళ‌.. తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితుడైన విక్రం తండ్రి వినోద్ రాజ్ అనారోగ్యంతో క‌న్నుమూశారు.

80 ఏళ్ల వ‌య‌సున్న వినోద్ రాజ్ మాజీ సైనికుడుగా ప‌ని చేశారు. ప‌లు క‌న్న‌డ‌.. త‌మిళ చిత్రాల్లో ఆయ‌న న‌టించారు. టీవీ సీరియ‌ల్స్ లో కూడా ఆయ‌న యాక్ట్ చేశారు. గిల్లీ చిత్రంలో న‌టి త్రిష‌కు తండ్రిగా న‌టించారు. గ‌డిచిన కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్న ఆయ‌న ఆదివారం సాయ‌త్రం స్థానిక  మ‌హాలింగ‌పురంలోని  త‌న ఇంట్లో ఆయ‌న తుది శ్వాస విడిచారు.

తండ్రి మ‌ర‌ణంతో విక్ర‌మ్ కుటుంబంలో విషాద ఛాయ‌లు నెల‌కొన్నాయి. ఈ రోజు అంత్య‌క్రియ‌ల్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లుగా విక్ర‌మ్ బంధువులు వెల్ల‌డించారు. కొత్త సంవ‌త్స‌రం ఆరంభంలో తండ్రిని కోల్పోవ‌టం విక్ర‌మ్ ను క‌లిచివేసింద‌ని చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు