ఎవరికీ సాధ్యం కానిది నాని సాధించాడు

ఎవరికీ సాధ్యం కానిది నాని సాధించాడు

గత మూడేళ్లలో ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు నేచురల్ స్టార్ నాని. టాలీవుడ్లో బడా బడా స్టార్లకు కూడా సాధ్యం కాని ఘనతను అతను ఈ ఏడాది అందుకున్నాడు. ఈ ఏడాది మూడు సినిమాలతో నాని పలకరిస్తే మూడూ సక్సెస్ అయ్యాయి. ‘నేను లోకల్’ బ్లాక్ బస్టర్ అయితే.. ‘నిన్ను కోరి’ సూపర్ హిట్టయింది. నాని నుంచి చివరగా వచ్చిన ‘ఎంసీఏ’ డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వసూళ్లు మాత్రం అదిరిపోయాయి. ఈ చిత్రం దాదాపుగా బ్రేక్ ఈవెన్ మార్కును అందుకున్నట్లే. సక్సెస్ ఫుల్ సినిమా అనిపించుకున్నట్లే. ఈ మూడు సినిమాలూ అమెరికాలో మిలియన్ డాలర్ క్లబ్బులోకి అడుగుపెట్టడం విశేషం.

‘నేను లోకల్’.. ‘నిన్ను కోరి’ ముందు నుంచి పాజిటివ్ టాక్‌తో రన్ అయ్యాయి కాబట్టి అవి మిలియన్ డాలర్ మార్కును అందుకోవడం విశేషం కాదు. కానీ ‘ఎంసీఏ’ పరిస్థితి అలా కాదు. దీనికి టాక్ ఏమంత బాగా లేదు. పైగా ఇది రొటీన్ ముద్ర వేయించుకున్న సినిమా. యుఎస్‌లో ఇలాంటి సినిమాలు ఆడటం అరుదు. ఓపెనింగ్స్ వస్తే రావచ్చు కానీ.. తర్వాత వసూళ్లు పడిపోతాయి. కానీ ‘ఎంసీఏ’ నిలబడగలిగింది. ఏకంగా మిలియన్ డాలర్ మార్కును అందుకుంది. ఒక్క ఏడాదిలో మూడు మిలియన్ డాలర్ సినిమాలు అందించడమంటే చిన్న విషయం కాదు. చాలామంది పెద్ద హీరోలు మిలియన్ క్లబ్బును అందుకోవడానికి ఆపసోపాలు పడుతుంటే ఒక్క ఏడాదిలో మూడు మిలియన్ డాలర్ సినిమాలిచ్చాడంటే నాని రేంజ్ గురించి ఏం మాట్లాడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English