బాలకృష్ణపై కమెడియన్ ట్వీట్ వైరల్

బాలకృష్ణపై కమెడియన్ ట్వీట్ వైరల్

మన హీరోల గురించి వేరే భాషలకు చెందిన సినీ ప్రముఖులెవరైనా కామెంట్లు చేస్తే ఆసక్తి కలుగుతుంది. ఇప్పుడు మన స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రముఖ తమిళ కమెడియన్ వివేక్ చేసిన వ్యాఖ్యలు ఇలాగే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. 90ల చివరి నుంచి ఓ దశాబ్దం పాటు తమిళ సినిమాల్లో కమెడియన్‌గా తిరుగులేని ఆధిపత్యం చలాయించిన వివేక్.. నిన్న చేసిన ఒక ట్వీట్ వైరల్ అవుతోంది.

తాను ఏదైనా బాధలో ఉన్నపుడు రెండు పనులు చేస్తానంటూ ఒక ట్వీట్ పెట్టాడు వివేక్. అందులో ఒకటి స్వామి వివేకానంద పుస్తకాలు చదవడం కాగా.. ఇంకోటి బాలకృష్ణ సార్ డైలాగులు, ఫైట్లు చూడటం అని ఆయన అన్నారు. ఈ రెండూ తనకు ఎనర్జీ ఇస్తాయని వివేక్ వ్యాఖ్యానించాడు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తమిళ కమెడియన్ ఏంటి.. బాధలో ఉన్నపుడు బాలయ్య సినిమాలు చూడటమేంటి అని షాకయ్యారంతా.

బాలయ్యకు సంబంధించిన కొన్ని డైలాగులు.. స్టంట్లపై ఒకప్పుడు పెద్ద ఎత్తున జోకులు పేలిన సంగతి తెలిసిందే. దాన్ని దృష్టిలో ఉంచుకుని వెటకారంగా ఏమైనా వివేక్ ఈ ట్వీట్ పెట్టాడా అని కొందరు సందేహించారు. కానీ వివేక్ స్థాయి నటుడు బాలయ్యను ఉద్దేశించి అలా మాట్లాడేందుకు అవకాశం లేదు.

తెర మీద కామెడీ చేసినప్పటికీ.. నిజ జీవితంలో వివేక్ చాలా సీరియస్‌గా ఉంటాడు. మరి వివేక్‌ సీరియస్‌గానే ఈ ట్వీట్ పెట్టి ఉంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమే. బాలయ్య సినిమాలు చూసి ఆయన ఎనర్జీ పొందుతున్నారంటే గొప్ప విషయమే కదా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English