శంకర్ బెదిరాడా? గ్రాఫిక్స్ పూర్తికాలేదా?

శంకర్ బెదిరాడా? గ్రాఫిక్స్ పూర్తికాలేదా?

రజనీకాంత్ హీరోగా దిగ్గజ దర్శకుడు శంకర్ రూపొందించిన రోబో సీక్వెల్ 2.0 ఆడియో ఫంక్షన్.. నిన్న దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరిగింది. రెహమాన్ లైవ్ పెర్ఫామెన్స్.. ఇతర కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 2.0పై ఆసక్తి మరింతగా పెరిగేందుకు ఈ కార్యక్రమం బాగానే హెల్ప్ అయింది.

అయితే.. ఇప్పుడీ సినిమాపై వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అందిరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2.0 రన్ టైం.. కేవలం 140 నిమిషాలు ఉంటుందట. ఈ మాట వినగానే అందరికీ ఒక్కసారి షాక్ తగిలేసిందనే చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటివరకూ అసలు శంకర్ సినిమా ఏదీ 170 నిమిషాల నిడివికి తక్కువగా లేదు. అంతసేపు ఎంటర్టెయిన్ చేయడం విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాలేదు. కానీ 2.0 విషయానికి వచ్చేసరికి కేవలం 140నిమిషాలకే పరిమితం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గ్లోబల్ రిలీజ్ ను బేస్ చేసుకుని ఇలా ప్లాన్ చేశాడని అంటున్నారు.

పైగా బడ్జెట్ కూడా చాలా ఎక్కువ కావడంతో.. తప్పనిసరిగా రన్ టైం విషయంలో కాంప్రమైజ్ కావాల్సి వచ్చిందని.. నిడివి తక్కువగా లేకపోతే కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో ఉండవని శంకర్ భయపడ్డాడనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు.. ఈ చిత్రానికి అనుకున్న విధంగా గ్రాఫిక్స్ వర్క్ పూర్తి స్థాయిలో ఫినిష్ కాలేదని.. ఆ మేరకు కూడా డ్యురేషన్ తగ్గిందనే యాంగిల్ కూడా ఒకటి వినిపిస్తోంది. రెండింటిలో ఏది వాస్తవమో.. రెండూ నిజాలేనా అన్న విషయాలకు యూనిట్ తప్ప ఎవరూ సమాధానం చెప్పలేరు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు