కొత్త ట్విస్టు: జై లవకుశ డౌట్‌ అట!

కొత్త ట్విస్టు: జై లవకుశ డౌట్‌ అట!

ఏ సినిమా ఎప్పుడొస్తుందనేది పెద్ద పజిల్‌గా మారిపోయిన పరిస్థితిలో తాజాగా మరో గాసిప్‌ తెరమీదకి వచ్చింది. దసరాకి విడుదలవుతుందని ప్రకటించిన 'జై లవకుశ' చిత్రం అప్పటకి రాకపోవచ్చునని టాక్‌ వినిపిస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెలాఖరుకి షూటింగ్‌ పూర్తయిపోవాలి.

అప్పుడు సెప్టెంబర్‌ 21న విడుదలకి ఎలాంటి ఆటంకాలు వుండవని అనుకున్నారు. కానీ ఈ నెలాఖరుకి పూర్తయ్యేలా లేదని, చాలా వర్క్‌ పెండింగ్‌ వుందని గుసగుసలు వున్నాయి. సెప్టెంబర్‌ రెండవ వారానికి గానీ పూర్తి కాకపోవచ్చునని చెబుతోన్న నేపథ్యంలో సెప్టెంబర్‌ 21న రావడం దాదాపు అసాధ్యమని సమాచారం.

సెప్టెంబర్‌ 27 డేట్‌ 'స్పైడర్‌' రిజర్వ్‌ చేసుకుంది కనుక 29కి 'జై లవకుశ' వెళుతుందా లేక అక్టోబర్‌కి వాయిదా పడుతుందా అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. నిర్మాతల వైపు నుంచి ఇంతవరకు వాయిదా గురించిన సమాచారం లేదు కానీ ఇండస్ట్రీలో మాత్రం ఈ టాక్‌ బలపడడంతో సెప్టెంబర్‌ 21 డేట్‌ని తీసేసుకోవాలని కొన్ని మీడియం బడ్జెట్‌ సినిమాలు కాచుకుని కూర్చున్నాయి. దీనిపై ఎన్టీఆర్‌ తరఫు పీఆర్‌ టీమే ఏదో ఒక స్పష్టతనివ్వాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు